నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ దసరా. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర బ్యానర్‌లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు 30 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వదిలారు మేకర్స్. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ నానికి సంబంధించిన ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 30, 2023కి ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు మేకర్స్.
చదవండి: బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు
ఇక ఈ సందర్భంగా రిలీజ్ చేసిన నాని కొత్త పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ పోస్టర్‌లో హాట్‌బ్యూటీ సిల్క్‌స్మితా పోస్టర్ ముందు నాని కూర్చుని ఉండగా.. మాసిన గడ్డం, బట్టలతో శరీరమంతా మట్టితో ఫుల్ మాస్‌లుక్‌లో దర్శనమిచ్చాడు నాని. కాగా ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తిసురేష్ నటిస్తోంది. ఇక చిత్రంలో సాయి కుమార్, తమిళ నటుడు సముద్రఖనిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. కాగా గోదావరిఖని సమీపంలోని సింగరేణి ప్రాంతానికి చెందిన ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ నిన్న హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లు ఈ సందర్భంగా మూవీ యూనిట్ పేర్కొంది.
MARCH 30TH WORLDWIDE 🔥#EtlaitheGatlayeSuskundhaam
— Nani (@NameisNani) August 26, 2022
This one will be remembered for a long time🖤
Telugu - Tamil - Malayalam - Kannada - Hindi #DASARA pic.twitter.com/70PuwsnIhq
Comments
Please login to add a commentAdd a comment