నేచురల్ స్టార్ నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ దొరికేశాడు హీరో అడివి శేష్. నానికి తెలియకుండా ఆయన ఆఫీస్‌లో షూట్ చేసిన ఈ వీడియోను శేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన నాని ట్విట్టర్ వేదికగా.. నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడుకుంటారా అంటూ అడివిశేష్‌ను ప్రశ్నించాడు.
ఇంతకీ ఆ డ్యాన్స్ వీడియో ఎందుకంటే.. అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా హిట్-2 అనే చిత్రంలో నటించారు. నాని ప్రారంభించిన ‘వాల్ పోస్టర్ సినిమాస్’ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో,హీరోయిన్లు ‘ఉరికే’ అనే పాటకు నాని ఆఫీస్‌లో డ్యాన్స్ చేశారు.
'ఇలా డ్యాన్స్ చేయడం సిగ్గుగానే ఉంది. కానీ మీకోసం ఏదైనా చేస్తా' అంటూ శేష్ వీడియోను షేర్ చేశాడు. ఈ డ్యాన్స్‌లో వారి కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది. అందుకే నాని.. 'నా ఆఫీస్‌ని ఇలా కూడా వాడొచ్చా' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Naa office ni ila kooda vaadocha 🧐@AdiviSesh @Meenakshiioffl https://t.co/PVdIc5UrXn
— Nani (@NameisNani) November 12, 2022
Comments
Please login to add a commentAdd a comment