HIT 2 Movie OTT Streaming Rights Acquired by this Platform Details Here! - Sakshi
Sakshi News home page

Hit 2 OTT : భారీ ధరకు అమ్ముడైన హిట్‌-2 రైట్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..

Published Sat, Dec 3 2022 11:12 AM | Last Updated on Sat, Dec 3 2022 11:58 AM

Adivi Sesh Hit 2 OTT Rights Owned By Amazon Prime Video - Sakshi

అడివి శేష్‌ హీరోగా నటించిన తాజా చిత్రం​ హిట్‌-2 శుక్రవారం(నిన్న)ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శైలేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాని స‌మ్ప‌ర‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని  నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. హిట్‌కి సీక్వెల్‌గా వస్తుండటంతో ముందుగానే ఈ సినిమాపై మాంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

ఇక ట్రైలర్‌, పాటలు సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. దీనికి తగ్గట్లే తొలిరోజే వసూల్ల పరంగా దూసుకెళ్తుందీ చిత్రం. ఓటీటీలో హిట్ 2 చిత్రానికి భారీగా బిజెనెస్ జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్‌ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఈ సినిమా హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ కూడా తీవ్రంగా పోటీ పడగా.. చివరకు ప్రైమ్ వీడియోకే భారీ ధరకు స్ట్రీమింగ్‌ రైట్స్‌ దక్కాయట. వచ్చే నెలలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల ‍కానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement