
నాని ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా సిద్ధమవుతోంది. నాని బర్త్‌డేకి రెండు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయని సమాచారం. ఫిబ్రవరి 24న నాని బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రాలు ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల ఫస్ట్ లుక్స్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ రూపొందుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ రూపొందుతోంది. ‘టక్ జగదీష్’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రీకరణ కోల్‌కత్తాలో జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.