
నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన 'హిట్ .. ది ఫస్టు కేస్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు నాని 'హిట్ 2 ది సెకండ్ కేస్' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. నేడు(డిసెంబర్ 17) అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్టు గ్లింప్స్ వదిలారు.
ఇందులో అడివి శేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ఆయనకి సంబంధించిన యాక్షన్ .. ఎమోషన్ సన్నివేశాలతో వదిలిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఒక కేసుకు సంబంధించిన ఆధారాల కోసం సాగే అన్వేషణ .. ఆ నేపథ్యంలో అతనికి సహకరించే పోలీస్ డాగ్ .. కేసు విషయంలో చిక్కుముడులను ఎలా విప్పుకురావాలనే ఆలోచనలో పడటం .. తన అన్వేషణకి అడ్డుపడినవారికి పోలీస్ కోటింగ్ ఇవ్వడం ఇవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment