అమ్మకు ప్రేమతో.. నాని | Hero Nani Emotional Tweet | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 31 2018 12:31 PM | Last Updated on Sat, Mar 31 2018 4:27 PM

Hero Nani Emotional Tweet - Sakshi

తల్లి విజయ లక్ష్మితో నాని

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. సినిమాలో ఎంత సరదాగా కనిపిస్తాడో సోషల్ మీడియాలో కూడా అదే తరహా కామెంట్స్‌ తో అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవల కొడుకు పుట్టిన రోజు సందర్భంగా నాని చేసిన ట్వీట్ వైరల్‌ అయ్యింది. తాజాగా తల్లి విజయలక్ష్మి పదవి విరమణ సందర్భంగా ఓ ఎమోషనల్‌ ట్వీట్ చేశారు నాని. ‘30 ఏళ్లుగా ఫార్మసిస్ట్‌. ఎప్పుడూ నవ్వుతూ.. సాయం చేయడానికి ముందుంటారు. 

వైద్యులు, రోగులు ఆమెను ఇష్టపడతారు. మేము మరింతగా ప్రేమిస్తాం. ఈ రోజు ఆమె చివరి వర్కింగ్‌ డే. నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మ’  అంటూ ట్వీట్ చేశారు నాని. ప్రస్తుతం నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఏప్రిల్‌ 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఈ రోజు (శనివారం) సాయంత్రం తిరుపతిలో నిర్వహించనున్నారు.  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమాలో నాగార్జునతో కలిసి నటిస్తున్నాడు నాని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement