
నేచులర్ స్టార్ నాని తన కొడుకుతో కలిసి చేసి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ సమయంలో కొడుకు అర్జున్‌తో సరదగా ఆడుకుంటూ ఉండే వీడియోల తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. చిల్డ్రన్స్ డే సందర్భంగా కొడుకుతో నాని సరదగా సమయాన్ని గడిపాడు. కొడుకు కోసం షూటింగ్స్‌ను పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి అమెరికాలో వాలిపోయాడు. బాలల దినోత్సవం సందర్భంగా తనయుడితో కలిసి కాలిఫోర్నియాలోని డిస్నీ ల్యాండ్‌లో సందడి చేశాడు.
చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో-హీరోయిన్! ముహుర్తం కూడా ఫిక్స్?
అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే ది పార్ట్‌నర్స్ స్టాచ్యూ(Partners statue) ముందు నాని, అర్జున్ అచ్చం అలాగే నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు. అర్జున్ మిక్కీ మౌస్‌లా డ్రెస్ వేసుకుని.. క్యూట్ క్యూట్‌గా ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నాని తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేశాడు. ఈ సందర్భంగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం నాని పోస్ట్ ఫ్యాన్స్‌ని, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు సరదా కామెంట్స్‌తో స్పందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment