ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌‌లో హీరో నాగ్‌ | Nagarjuna Accept Fitness Challenge Posted Video | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌‌లో హీరో నాగ్‌

Published Fri, Jun 1 2018 1:43 PM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM

ప్రస్తుతం దేశం మొత్తం ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు... అంతా ఒకరికొకరు సవాళ్లు విసిరుకుంటూ వీడియోలతో హల్‌ చల్‌ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లోని ప్రముఖులు కూడా క్యూ కట్టేశారు. స్టార్‌ హీరో ఎన్టీఆర్‌.. చెర్రీ, మహేష్‌, కొరటాల శివ, రాజమౌళి, కళ్యాణ్‌ రామ్‌ తదితరులకు ఛాలెంజ్‌ విసరటం చూశాం. ఇప్పుడు సీనియర్‌ హీరో నాగ్‌ వంతు వచ్చింది. 

తనయుడు అఖిల్‌ విసిరిన ఛాలెంజ్‌కు నాగార్జున అక్కినేని స్పందించారు. ఈ ఉదయం జిమ్‌లో చేసిన ఎక్సర్‌సైజ్‌లకు వీడియో ఒకదానిని పోస్ట్‌ చేశాడు. వెయిట్‌ లిఫ్టింగ్‌కు సంబంధించిన వర్కవుట్ల కోసం బాగానే కష్టపడ్డాడు. ఇవన్నీ చూస్తుంటే 58 ఏళ్ల వయసులోనూ నాగ్‌ ఫిట్‌గా ఉండటంలో ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అన్నట్లు ఇంతకీ నాగ్‌ ఎవరికి ఛాలెంజ్‌ విసిరాడో తెలుసా? నేచురల్‌ స్టార్‌ నాని, హీరో కార్తీ, శిల్పారెడ్డిలకు. ఆ వీడియో చూసిన అభిమానులంతా ‘వాహ్‌ నాగ్‌’ అంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement