నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. ఈ చితంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్‌లోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టక్ జగదీష్ చిత్రం జులై 30న విడుదల కాబోతున్నట్లు గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. మూవీ రిలీజ్‌కు సంబంధించి వస్తున్న వార్తలను నమ్మవద్దని పేర్కొంది.
‘టక్ జగదీష్’ రిలీజ్ పై వస్తున్న వార్తలను రూమర్స్‌గా కొట్టిపారేసింది. మా సినిమా థియేటర్స్‌లోనే విడుదలవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తాం అంటూ చిత్ర బృందం ప్రకటించింది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment