
తాళ్లపూడి: తాళ్లపూడిలోని గోదావరి తీరంలో నాని హీరోగా, సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ చిత్ర షూటింగ్‌తో సందడి వాతావరణం నెలకొంది. చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను గోదావరి తీరం, గోదావరి నదిలో చిత్రీకరించారు. రెండో రోజూ సోమవారం హీరో నాని, హీరోయిన్ సాయిపల్లవి ఇతర నటులు రేవు వద్ద నుంచి పడవ దాటే సన్నివేశంతో పాటు పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా వెంకట్ బోయినపల్లి నిర్మాతగా బాబి ప్రాడక్షన్ మేనేజర్‌గా వ్యహరిస్తున్నారు. షూటింగ్ చూసేందుకు అధిక సంఖ్యలో జనం గోదావరి తీరానికి చేరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment