![Ajay Devgan And Shahid Kapoor Plans Remakes Nani Shyam Singha Roy - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/4/ajay-devagan-and-shahid-kap.jpg.webp?itok=vpa9OkwJ)
నేచురల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రిభినయనం చేసి విజయం సాధించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. గతేడాది క్మిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి టాక్ సంపాదించుకుంది. థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీలో సైతం రికార్డు వ్యూస్‌ను రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: Prabhas-Pooja Hegde: ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా?
అయితే ఈ రీమేక్ ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్స్ అందుకుంటున్న హీరో షాహిద్ కపూర్ రీమేక్ హక్కును తీసుకునే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అగ్ర హీరో అజయ్ దేవగన్ సైతం శ్యామ్ సింగరాయ్ రీమేక్‌కు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఒకే దర్శకుడిని రీమేక్ కోసం వీరిద్దరు సంప్రదించినట్లు బి-టౌన్‌లో వినికిడి. మరి ఇందులో ఎవరి ప్రయత్నాలు ఫలించి శ్యామ్ సింగరాయ్ హక్కులను పొందుతారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment