మంజుల నిర్మాతగా నాని సినిమా | Manjula to produce Nani Vikram movie | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 13 2017 1:36 PM | Last Updated on Wed, Dec 13 2017 1:42 PM

Manjula to produce Nani Vikram movie - Sakshi

సూపర్ స్టార్ కృష్ణ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన మంజుల.. నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దర్శకురాలిగా మారి సందీప్ కిషన్ హీరోగా మనసుకు నచ్చింది పేరుతో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా స్టార్ చేసే ఆలోచనలో ఉంది మంజుల. అయితే ఆ సినిమాకు మంజుల కేవలం నిర్మాతగానే వ్యవహరించనుందట.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల ఓ సినిమాను నిర్మించనుంది. ప్రస్తుతం అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న హలో సినిమా పనుల్లో బిజీగా ఉన్న విక్రమ్, ఆ సినిమా పూర్తయిన వెంటనే తదుపరి చిత్రం పనులు మొదలుపెట్టనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement