Hello movie
-
'హలో' మూవీ భామ చీర ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!
దర్శకుడు ప్రియదర్శన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణి విభిన్న పాత్రలు పోషిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. హీరోయిన్గా రాణిస్తోంది. నటిగా గుర్తింపులో ఆమె ఎంచుకుంటున్న పాత్రలు.. ఆమె అభినయం తోడవుతుంటే.. హీరోయిన్గా రాణించడానికి మాత్రం ఆమె అనుసరిస్తున్న ఫ్యాషన్ అండ్ స్టయిలే హెల్ప్ అవుతున్నాయి. అలా హెల్ప్ అవుతున్న బ్రాండ్స్‌లో కొన్నిటి గురించి.. దీప్తి.. హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ దీప్తి పోతినేని.. 1980ల నాటి ఫ్యాషన్‌ను పునః సృష్టించడంలో సిద్ధహస్తురాలు. అప్పటి పట్టు, ప్యూర్ ఆర్గంజా, టిష్యూ, కాటన్ ఫ్యాబ్రిక్స్‌తో రూపొందించే యూనిక్ డిజైనర్ చీరలు దీప్తిని ఎయిటీస్ స్పెషలిస్ట్ డిజైనర్‌గా నిలబెట్టాయి. ఎక్కువగా సంప్రదాయ ఎంబ్రాయిడరీనే వాడుతుంటుంది. ఈ మధ్యనే తన పేరు మీదే హైదరాబాద్‌లో ఓ ఫ్యాషన్ హౌస్‌నూ ప్రారంభించింది. డిజైన్ ను బట్టే ధరలు ఉంటాయి.. వేల నుంచి లక్షల్లో! ఆన్ లైన్ లోనూ లభ్యం. కళ్యాణ్ జ్యూలర్స్.. టాప్–100 విలాసవంతమైన బ్రాండ్స్‌లో కల్యాణ్ జ్యూలర్స్ ఒకటి. 1908లో ప్రారంభమైన ఈ సంస్థకు ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రముఖ నగరాల్లో మొత్తం 150 బ్రాంచ్‌లున్నాయి. సరికొత్త డిజైన్సే దీని బ్రాండ్ వాల్యూ అయితే కొనుగోలుదారుల నమ్మకం ఈ బ్రాండ్‌కి యాడెడ్ వాల్యూ. నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూలరీ బ్రాండ్: కల్యాణ్ జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చీర డిజైనర్: దీప్తి (రూ.52,800) కంఫర్ట్ జోన్లో గ్రోత్ ఉండదు. గ్రోత్ జోన్లో కంఫర్ట్ ఉండదు. నేను ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా. అందుకే అప్పుడప్పుడు.. ఎంచుకునే పాత్రల్లో, ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేస్తుంటా! – కల్యాణీ ప్రియదర్శన్. ఇవి చదవండి: హెల్త్: 'మెగా షేప్ మసాజర్' తో.. ఫిట్నెస్ సెంటర్స్‌కి చెక్! -
వరల్డ్ స్టంట్ అవార్డ్స్‌కు హలో
‘టారస్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్’ పేరుతో ప్రతి సంవత్సరం వరల్డ్ మూవీస్‌లోని బెస్ట్ స్టంట్ పెర్ఫార్మర్స్కు అవార్డ్స్ ప్రకటిస్తారు. ఈ ఉత్సవం లాస్ ఏంజెల్స్‌లో జరుగుతుంది. విశేషం ఏంటంటే.. ‘బెస్ట్ యాక్షన్ ఇన్ ఏ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ’లో ‘హలో’ సినిమా నామినేట్ అయింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ మాట్లాడుతూ – ‘‘హలో’ సినిమా ‘టారస్ వరల్డ్ అవార్డ్స్ క్యాటగిరీలో నామినేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నాగార్జున సార్, యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్, కెమెరామేన్ పీయస్ వినోద్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్లకు థ్యాంక్స్. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగా రావడానికి మీరంతా కారణం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అఖిల్.. నీ డెడికేషన్, హార్డ్ వర్క్, నీ యాటీట్యూడ్ నిన్ను కొత్త హైట్స్‌కు తీసుకువెళ్తాయి. ఎప్పుడూ ఇలానే ఉండు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. నామినేషన్ అయితే సంపాదించుకుంది కానీ ‘హలో’కి అవార్డు దక్కలేదు. చైనీస్ మూవీ ‘ఉల్ఫ్ వారియర్ 2’కి అవార్డు దక్కింది. ఏది ఏమైనా ‘ప్రపంచ సినిమాలు’ పోటీ పడే అవార్డ్స్‌లో ఓ ఇండియన్ మూవీ నామినేషన్ వరకూ వెళ్లడం గొప్ప అని సినిమా లవర్స్ అంటున్నారు. -
‘హలో’కు బెస్ట్ యాక్షన్ మూవీ అవార్డు..?
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా చేసిన చిత్రం హలో. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా... కలెక్షన్లు మాత్రం ఆశించినంతగా రాలేదు. సినిమా టేకింగ్, కథను నడిపిన విధానంలో డైరెక్టర్ విక్రమ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ‘హలో’ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. హలో సినిమా బెస్ట్ యాక్షన్ మూవీ అవార్డుకు నామినేట్ అయిందని విక్రమ్ ట్వీటర్లో పోస్ట్ చేశారు. వరల్డ్ స్టంట్స్ అవార్డు సంస్థ ఇచ్చే పురస్కారాలకు హలో మూవీ నామినేట్ అవ్వడం ఆనందంగా ఉందంటూ... ‘ఫైట్ మాస్టర్ బాబ్ బ్రౌన్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, కెమెరామెన్ పి.ఎస్.వినోద్, అనూప్ రూబెన్స్, నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మీరంతా కలిసి ఈ పోరాట సన్నివేశాల్ని ఇంత బాగా వచ్చేలా చేశారు. అఖిల్ అంకితభావం, హార్డ్ వర్క్ వల్లే ఇదంతా సాధ్యమైంది, నీ యాటిట్యూడ్ నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాయి. నువ్వు అలాగే ఉండాలి’ అంటూ పోస్ట్ చేశారు. #worldstuntawards #akhilsayshello pic.twitter.com/NBTNUBCTBp — Vikram K Kumar (@Vikram_K_Kumar) 14 May 2018 -
అఖిల్‌కు జోడిగా మేఘా
హలో సినిమాతో ఆకట్టుకున్న అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా లై ఫేం మేఘా ఆకాష్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటి వరకు చేసిన రెండు సినిమాల్లో కొత్త హీరోయిన్లతో నటించిన అఖిల్ మూడో సినిమాలో మాత్రం ఫాంలో ఉన్న హీరోయిన్‌తో రొమాన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి ఎలాగైన కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నాడు అక్కినేని వారసుడు. -
అఖిల్ కొత్త సినిమాకు యంగ్ డైరెక్టర్..?
‘అఖిల్’ సినిమాతో గ్రాండ్‌గా లాంచ్ అయిన అక్కినేని యువ కథానాయకుడు తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో రెండో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల హలో అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్, మంచి మార్కులు సాధించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. దీంతో మూడో సినిమా కోసం మరోసారి గట్టి కసరత్తులు చేస్తున్నాడు. ఇటీవల అఖిల్.. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. ఈ సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగిందన్న ప్రచారం తెరమీదకు వచ్చింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో వినిపిస్తోంది. ఇటీవల తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ సాధించిన వెంకీ అట్లూరి, అఖిల్ మూడో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమాను బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. ఏప్రిల్‌లోనే సినిమా ప్రారంభం కానుందన్న ప్రచారం జరుగుతోంది. -
ఆమె అందగత్తే కానీ.. ఫ్యాన్స్ చేసిన పనే..
గురుగ్రామ్ : ’హలో’ సినిమాతో హీరోయిన్గా కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. పడిచచ్చిపోయే పిచ్చి ఫ్యాన్స్‌ను కూడా సంపాదించుకున్నారు. అవును. ఆ ఫ్యాన్ ఫాలోయింగే వికాస్ ప్రజాపతి అనే వ్యక్తి పాలిట శరాఘాతంగా మారింది. ’హలో’ చిత్రంలోని ఓ సన్నివేశంలో స్నేహితుడితో విడిపోతున్న చిన్నారి కళ్యాణి ప్రియదర్శన్ వంద రూపాయల నోట్‌పై ఫోన్ నంబర్‌ను రాసి కారులోంచి కిందకు వదిలేస్తుంది. ఆ నంబర్‌ను హీరో అఖిల్ సినిమా చివర్లో తీసుకుంటే.. సినిమా చూసిన వాళ్లలో కొందరు యువకులు మాత్రం అప్పటికప్పుడే నోట్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీకే అర్థమై ఉంటుంది. కళ్యాణితో మాట్లాడాలంటూ ఆ నంబర్‌కు ఫోన్ కాల్స్ వరుస కట్టాయి. వాస్తవానికి ఆ నంబర్ గురుగ్రామ్‌లో నివసిస్తున్న వికాస్ ప్రజాపతిది. ఆయన వృత్తి రీత్యా కంప్యూటర్ ఆపరేటర్. సినిమా విడుదలైన మరుసటి రోజు నుంచి కళ్యాణితో మాట్లాడాలంటూ వేల సంఖ్యలో కాల్స్ రావడంతో ఏం జరుగుతుందో వికాస్‌కు అర్థం కాలేదు. అసలు కళ్యాణి ప్రియదర్శన్ ఎవరో తెలుసుకోవడానికి గూగుల్ చేయగా ఆమె ఓ హీరోయిన్ అని తెలిసి షాక్ తిన్నారు. కాల్ చేసిన ప్రతి ఒక్కరికీ అది కళ్యాణి నంబర్ కాదని చెప్పలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వికాస్ వెల్లడించారు. గత ఐదేళ్లుగా తాను ఈ నంబర్‌ను వాడుతున్నట్లు తెలిపారు. ’హలో’ నిర్మాతలపై కేసు వేస్తున్నట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లోనైనా ఫోన్ కాల్స్ రావడం ఆగుతుందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. వికాస్ తరఫు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్న న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ పర్సనల్ లైఫ్‌ను కళ్యాణి ఫ్యాన్స్ నాశనం చేశారని అన్నారు. వరుస ఫోన్ కాల్స్ రావడం వల్ల ఆఫీసులో పని చేయలేక వికాస్ తన బాస్‌లతో తిట్లు తినాల్సి వచ్చిందని తెలిపారు. భార్య, బిడ్డలతో మాట్లాడటానికి కూడా గ్యాప్ లేకుండా ఫోన్స్ వచ్చేవని వెల్లడించారు. ప్రజాపతి నోటిసులపై స్పందించిన ’హలో’ నిర్మాతలు ఆ నెంబర్‌ను వినియోగించేందుకు టెలికాం కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, తాము అలాంటి అనుమతి ఇవ్వలేదని సదరు టెలికాం కంపెనీ పేర్కొనడం గమనార్హం. -
అఖిల్ కొత్త సినిమా అప్డేట్
తొలి సినిమాతో ఘోరంగా విఫలమైన అక్కినేని యంగ్ హీరో అఖిల్, రెండో సినిమాతో ఆకట్టుకున్నాడు. హలో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ రెండో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్, డ్యాన్స్ లలో అఖిల్ చూపిస్తున్న ఈజ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టిన ఈ యంగ్ హీరో ఈ నెల 10న కొత్త సినిమాను ప్రకటించనున్నాడు. ఇటీవల రెండు కథలు వింటున్నట్టుగా వెల్లడించాడు అఖిల్. వీటిలో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి సోదరుడు సత్య పినిశెట్టి చెప్పిన కథ కూడా ఉందట. అఖిల్ కూడా ఈ యువ దర్శకుడితోనే కలిసి పనిచేసేందుకు ఆసక్తికనబరుస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే హలో విషయంలో కూడా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించిన తరువాత విక్రమ్ ను ఫైనల్ చేశారు. మరి మూడో సినిమా విషయంలో అఖిల్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి. -
నా మనసు దోచేశావ్ అని మెసేజ్ చేసింది
‘‘ మాస్, క్లాస్ అని కాదు. కథ బాగుండాలి. నాకు నచ్చాలి. స్క్రిప్ట్‌లోని నా క్యారెక్టర్ ప్రేక్షకులు మెచ్చుకుంటారని నాకు అనిపిస్తే తప్పకుండా సినిమా చేస్తాను. మంచి సినిమాలో భాగం కావడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటా. ముందు మాస్, ఆ తర్వాత క్లాస్, మళ్లీ మాస్... ఇలా లెక్కలు వేసుకుని సినిమాలు చేయాలన్న మైండ్‌సెట్ ప్రజెంట్ నాకు లేదు. నేనేం మిస్టేక్ చేశానో తెలుసుకోవడానికి నా ఫస్ట్ మూవీ ‘అఖిల్’ని 30 సార్లు చూశా’’ అన్నారు అఖిల్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అఖిల్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం ‘హలో’. ఈ నెల 22న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన బాగుందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయులు సమావేశంలో హీరో అఖిల్ చెప్పిన విశేషాలు... ► యాక్టర్‌గా ఇంప్రూవ్ అయ్యానని నాతోటి యాక్టర్స్ అన్నారు. ‘సెటిల్డ్ ఫెర్మార్మెన్స్’ అని చిరంజీవిగారు అన్నారు. చిరంజీవిగారు నా లక్కీ చార్మ్. ఆయన ఒక ఫాదర్‌లా గైడ్ చేస్తారు. చరణ్‌తో కూడా నేను క్లోజ్‌గా ఉంటాను. నన్నే కాదు యాక్టర్స్ అందర్నీ చిరంజీవిగారు ప్రోత్సహిస్తారు. ఆయనకు సినిమాల మీద ఉన్న ప్యాషన్ అలాంటిది. డైరెక్టర్ ప్రియదర్శన్‌గారు నాన్నగారికి ఫోన్ చేసి అభినందిచారు. ► నాన్నగారు చాలా స్ట్రాంగ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాకి ఫాదర్ ఆయన. రామ్‌గోపాల్ వర్మ సినిమా షూటింగ్ షెడ్యూల్‌ని క్యాన్సిల్ చేసి మరీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకున్నారు నాన్నగారు. అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు లక్కీ. టెన్షన్ అంతా నాన్నగారే తీసుకున్నారు. నాన్నగారు ‘హలో’ సినిమాను 20 సార్లు చూశారు. దాంతో నాన్నగారికి సినిమాపై జడ్జ్మెంట్ పోయింది. ఫస్ట్‌టైమ్ ఎడిట్ రూమ్‌లో సెకండాఫ్, క్లైమాక్స్ చూసి హ్యాపీ ఫీలయ్యారు. యాక్టర్‌గా ఇంప్రూవ్ అయ్యావని నాన్నగారు మెచ్చుకున్నారు. హ్యాపీగా అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ సాయంతోనే పాట పాడగలిగాను. ‘అఖిల్’ సినిమాను నాన్నగారు సెలక్ట్ చేయలేదు. నేనే ఎంచుకున్నాను. ► సినిమా స్టార్ట్ చేసినప్పుడే సీజీ వర్క్ ఎక్కువగా వద్దనుకున్నాం. యాక్షన్ సీక్వెన్స్ బాగా రావడానికి నేను ఒక్కడినే కారణం కాదు. 15 మెంబర్స్ టీమ్ వర్క్ ఉంది. అయితే ట్రైనింగ్ కోసం కష్టపడ్డాను. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాం. విక్రమ్‌గారు బాగా తీశారు. రమ్యకృష్ణగారితో నటించడం హ్యాపీగా ఫీలవుతున్నాను. హీరోయిన్ కల్యాణీ బాగా చేసింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను ఇన్వాల్వ్ కాలేదు. కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యాను. ► క్లైమాక్స్ సీన్‌కు సంబంధించి ఒక అమ్మాయి ‘యు స్టోల్ మై హార్ట్’ అని మేసేజ్ చేసింది. అదే బెస్ట్ కాంప్లిమెంట్‌గా ఫీల్ అవుతున్నాను. స్క్రిప్ట్ పరంగా డ్యాన్స్‌కు పెద్ద స్కోప్ లేదు. కథను నమ్మాను. సో.. సినిమాలో చైల్డ్ ఎపిసోడ్ లెంగ్త్ ఎక్కువ అనిపించలేదు. శ్రీను (అఖిల్ పాత్ర పేరు), జున్ను (కల్యాణి పాత్ర పేరు) చిన్నప్పటి క్యారెక్టర్లు చేసిన పిల్లలు బాగా నటించారు. ► జనరల్‌గా నాకు టెన్షన్ ఎక్కువ. ఈ సినిమా రిలీజ్‌కు ముందు అసలు నిద్రపోలేదు. మార్నింగ్ 8 వరకూ వెయిట్ చేసి యూఎస్ ఫస్ట్ రివ్యూ విన్న తర్వాత ఆనందపడ్డాను. ఆ తర్వాత హాయిగా నిద్రపోయాను. సినిమా రివ్యూల్లో 3రేటింగ్ ఇచ్చారు. హ్యాపీ ఫీలయ్యాను. హిట్ సాధించాను. కలెక్షన్స్ గురించి మాట్లాడటంలేదు. ఒక మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద సోలోగా వస్తే బాగుండు అనిపించింది. కానీ రెండు సినిమాలను తీసుకోగల మార్కెట్ తెలుగు ఇండస్ట్రీలో వచ్చిందనుకుంటున్నాను. ► ఈ సినిమా చేస్తున్నప్పుడు యాక్టింగ్ వైజ్‌గానే కాదు. ఫిల్మ్ మేకింగ్ పరంగా కొత్త విషయాలను నేర్చుకున్నాను. మా నాన్నగారు, పీఎస్ వినోద్, కె.విక్రమ్‌కుమార్ లాంటి డెడికేషన్ ఉన్నవారితో వర్క్ చేసాను. ఆ అనుభవం నాకు హెల్ప్ అవుతుంది. ► ఈ సినిమా సక్సెస్ తర్వాత గ్యాప్ తీసుకోవాలనుకోవ డం లేదు. హాలిడేస్ వద్దు. జనవరిలో కొత్త సినిమాను అనౌన్స్ చేసి, ఫిబ్రవరిలో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. నా నెక్ట్స్ సినిమా ఇంకా ఫిక్స్ కాలేదు. జనవరి 10లోపు అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్ వంశీ పైడిపల్లిని కలిశాను. కొరటాల శివగారితో లంచ్ చేశాను. ఇలా కలిసిన అందరి డైరెక్టర్స్‌తో సినిమాలు చేయలేం. సుకుమార్‌గారితో చేయాలని ఉంది. కథ కుదరాలి. బాలీవుడ్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో చేయాలని ఉంది. హిందీ, తెలుగు భాషల్లో బైలింగువల్ చేయాలనే ఆలోచన ఉంది. తెలుగు ఇండస్ట్రీనే నాకు ముఖ్యం. క్రికెట్ నాకు ఓన్లీ స్ట్రెస్ బస్టర్ మాత్రమే. న్యూ ఇయర్ అన్నయ్య(నాగచైతన్య), వదినలతో(సమంత)సెలబ్రేట్ చేసుకుంటా. -
జనవరి 10న బిగ్ ఎనౌన్స్మెంట్
హలో సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అక్కినేని యువ నటుడు అఖిల్, ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అఖిల్ సినిమాతో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో లాంగ్ గ్యాప్ తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమాతో ఆకట్టుకున్నాడు. వారసుడికి ఎలాగైన హిట్ ఇవ్వాలన్న కసితో అక్కినేని నాగార్జున అంతా తానే అయి ఈ సినిమాను రూపొందించాడు. హలో సక్సెస్ సాధించటంతో ఇప్పుడు అఖిల్ తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది. తాజాగా అఖిల్ కూడా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై స్పందించాడు. జనవరి 10న మూడో సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తానని తెలిపాడు. ఇప్పటికే అఖిల్ నెక్ట్స్ సినిమా కోసం బోయపాటి శ్రీను, సుకుమార్ లతో చర్చలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అఖిల్ మూడో సినిమాను ఎవరు నిర్మించనున్నారు, దర్శకుడు ఎవరు అన్న విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
దుమ్మురేపుతున్న కలెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: తాజాగా విడుదలైన రెండు తెలుగు సినిమాలు ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి), హలో.. అమెరికాలో దుమ్మురేపుతున్నాయి. ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నాయి. మొదటి ఐదు రోజుల్లో ఎంసీఏ సినిమా రూ. 4.63 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని సినిమా విమర్శకుడు, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. హలో చిత్రం తొలి నాలుగు రోజుల్లో రూ.3.93 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. సోమవారం కలెక్షన్లు కూడా కలుపుకుంటే రూ. 5 కోట్లు దాటే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రెండు సినిమాలు భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. క్రిస్మస్ సెలవుల్లో ఈ సినిమాలను విడుదల చేయడంతో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. మిడిల్ క్లాస్ అబ్బాయి మొదటి ఐదు రోజుల్లో మొత్తం రూ. 21.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. తొలి వారంలో కలెక్షన్లు రూ. 25 కోట్లు దాటతాయని భావిస్తున్నారు. హలో మూవీ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.05 కోట్ల గ్రాస్ సాధించినట్టు వెల్లడించారు. ఈ రెండు సినిమాలకు పాజిటవ్ టాక్ రావడంతో మున్ముందు కలెక్షన్లు పెరిగే అవకాశముంది. -
అఖిల్ వంద గంటలు కష్టపడ్డాడు..!
హలో సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్, ఆ సక్సెస్‌ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో హీరోగానే కాదు గాయకుడిగానూ ప్రూవ్ చేసుకున్నాడు అఖిల్. ఈ సినిమాలో ‘ఏవేవో కలలు కన్నా’ అంటూ సాగే రొమాంటిక్ మెలోడిని ఆలపించాడు అఖిల్. ఈ పాటను పలు వేదికల మీద కూడా పర్ఫామ్ చేసిన అఖిల్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆ పాటకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు అఖిల్. తనను గాయకుడిగా మార్చిన క్రెడిట్ సంగీత దర్శకుడు అనూప్ రెబెన్స్ దే అన్న అఖిల్, తామిద్దరం ఆ పాట కోసం వంద గంటలకు పైగా శ్రమించినట్టు వెల్లడించాడు. అనూప్ తనకు రెగ్యులర్ సింగర్‌లా పాట పాడేందుకు కావాల్సిన మెలకువలు నేర్చించాడని తెలిపాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. -
దూసుకెళుతున్న ’హలో’.... థ్యాంక్స్ చెప్పిన అఖిల్
అక్కినేని అఖిల్‌ను రీలాంచ్ చేస్తూ దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన సినిమా ’హలో’... ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి కూడా మంచి టాక్ వినిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా డీసెంట్ కలెక్షన్లు రాబడుతున్నదని సమాచారం. ‘హలో’ సినిమాకు మంచి టాక్ సొంతమై విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో చిత్ర హీరో అఖిల్ తాజాగా ట్విట్టర్లో స్పందించారు. ‘మా చిత్రం పట్ల ప్రేమాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు మాకు ఎంతో విలువైనవి. ఇందుకు చిత్రయూనిట్ మొత్తం కృతజ్ఞతలు తెలుపుతుంది’ అని అఖిల్ ట్వీట్ చేశాడు. అమెరికా బాక్సాఫీస్ వద్ద రెండురోజుల్లోనే అరమిలియన్ డాలర్ల మార్క్‌ను ఈ చిత్రం దాటిందంటూ ఓ పోస్టర్‌ను పెట్టారు. నాగార్జున తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్ సరసన కల్యాణీ ప్రియదర్శన్ నటించి.. తొలిసారి చిత్రసీమలోకి అడుగుపెట్టింది. కల్యాణీ.. నటి లిజీ-దర్శకుడు ప్రియదర్శన్ కూతురు. Thank you for all the love and appreciation really means a lot to all of us and the whole team is greatfull pic.twitter.com/6DyoDFV2bj — Akhil Akkineni (@AkhilAkkineni8) 24 December 2017 -
హలో... నేను చాలా స్ట్రాంగ్
హలో.. నేను అక్కడ అమ్మాయిని అయినా మీరు ఇక్కడి అమ్మాయి అనే అనుకోవచ్చు. హలో.. నన్ను పరిచయం చేసిన తెలుగు తెర అంటే నాకు బాగా ఇష్టం. హలో.. ఫస్ట్ సినిమాతో నాకు మంచి మార్కులేసినందుకు థ్యాంక్స్. హలో.. ఎప్పటికీ మీ ప్రేమాభిమానాలు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా.. అంటున్నారు కల్యాణీ ప్రియదర్శన్ డాటరాఫ్ నటి లిజీ–దర్శకుడు ప్రియదర్శన్. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ‘హలో’లో అఖిల్ సరసన మెరిసిన ఈ మలయాళ మందారంతో స్పెషల్ టాక్. ► తెలుగు ఆడియన్స్‌కి హలో చెప్పడం ఎలా ఉంది? (నవ్వుతూ). హలో యూనివర్శల్. ఫోన్ తీస్తే.. కామన్‌గా అందరూ అనేది అదే. అలాంటి ఓ యూనివర్శల్ వర్డ్ ఉన్న టైటిల్‌తో తెలుగువారిని పలకరించడం హ్యాపీగా ఉంది. ► ‘హలో’ లాంటి పెద్ద లాంచ్‌ను ఎక్స్పెక్ట్ చేశారా ? లేదు. అందులోనూ తెలుగు ఇండస్ట్రీలో. ‘హలో’ కోసం చాలారోజులు హీరోయిన్ని వెతికారని తెలుసు. పీయస్ వినోద్ (కెమెరామ్యాన్) వాళ్ళ వైఫ్‌కి, మా ఫ్యామిలీకి ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నారు. నాగ్‌సార్ వాళ్ళకి కూడా వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలా నన్ను రికమండ్ చేశారు. నా ఫొటో ఫేస్బుక్లో చూసినట్టు ఉన్నారు. మా నాన్న దగ్గర డైరెక్టర్ విక్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు. ఆయనకు నేను తెలుసు. కథకి సూట్ అవుతానని, ఆడిషన్స్‌కి పిలిచారు. అలా తెలుగు ఆడియన్స్‌కి హలో చెప్పే చాన్స్ వచ్చింది. ► ఫస్ట్ కెమెరా వెనక.. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఎలా ఉంది ఫీలింగ్? వెరీ డిఫరెంట్. రెండు ప్రపంచాల్లో ఉన్నట్లు ఉంది. మొదట్లో కొంచెం నెర్వస్ అయ్యాను. కానీ, దర్శకుడు విక్రమ్‌గారితో పాటు సెట్ మెంబర్స్ అంతా హెల్ప్ చేశారు. దాంతో ఈజీ అనిపించింది. ► అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాగుందా? హీరోయిన్గా కంఫర్ట్‌గా ఉందా? దేని ప్రెజర్ దానికి ఉంటుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్టర్‌కు అసిస్టెంట్‌గా చేసేదాన్ని. ప్రొడక్షన్ డిజైనింగ్ చేసేవాళ్లం. సెట్లో ఉంటూ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా చూసుకోవాలి. నాకు డస్ట్ అలర్జీ ఉండటం వల్ల తరచూ సిక్ అవుతూ ఉండేదాన్ని. ఇక, హీరోయిన్గా అంటే ఉదయం నాలుగు గంటలకే షూటింగ్ ఉంటుంది. రోజు మొత్తంలో జస్ట్ నాలుగు గంటలే నిద్రపోయినా పది గంటలు పడుకున్నంత ప్రెష్‌గా కనిపించాలి. ఫిజిక్ గురించి పట్టించుకోవాలి. అందంగా కనిపించాలి. ఇవన్నీ కెమెరా వెనక తీసుకునే జాగ్రత్తలు. కెమెరా ముందుకెళ్లాక యాక్టింగ్ విషయంలో పర్ఫెక్షన్ చూపించాలి. ఏ జాబ్ అయినా కొన్ని కష్టాలు ఉంటాయి. అయితే మనం ఎంజాయ్ చేయగలిగితే ఏదీ కష్టం అనిపించదు. ► హీరోయిన్ కావాలని ఎప్పుడు అనుకున్నారు? ఆ ఆలోచన చిన్నప్పటి నుంచీ ఉంది. కానీ యాక్టింగ్ ఫీల్డ్ అంత ఈజీ కాదని తెలుసు. కెమెరా ముందు ఎంత బాగా యాక్ట్ చేసినా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రాకుండా చూసుకోవడానికి చాలా హోమ్‌వర్క్ చేయాలి. బట్... పర్సనల్‌గా మొదట్లో నేను చాలా సెన్సిటివ్. ఎవరైనా విమర్శిస్తే అంత ఈజీగా తీసుకోలేకపోయేదాన్ని. బాగా బాధపడేదాన్ని. ఏడ్చేదాన్ని. అంత సాఫ్ట్. ఇండస్ట్రీలో ఇలా ఉంటే కష్టం అని తెలుసు. అందుకే ఇక్కడికొచ్చాక నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను. ► అంటే.. ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యారా? ఇప్పుడంటే ఇప్పుడు కాదు. లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పర్సనల్‌గా స్ట్రాంగ్ అవుతున్నాను. ► ఏదైనా ఇన్సిడెంట్స్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేశాయా? ప్రత్యేకమైన సంఘటనలు జరగలేదు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాల్సిందే కదా. సింగపూర్‌లో చదువుకున్నాను. తర్వాత అమెరికా వెళ్లాను. అవన్నీ నా సొంత నిర్ణయాలే. అంత దూరం వెళ్లి, ఒంటరిగా ఉన్న మనం స్ట్రాంగ్ కాకపోవడం ఏంటి? అంటే... మనంతట మనం సాఫ్ట్ అనుకుంటున్నామా? అనే ఆలోచన మొదలైంది. నా బలం తెలుసుకున్నాను. ► టీనేజ్‌లో హీరోయిన్ అయ్యారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఇన్‌డైరెక్ట్‌గా ఏజ్ అడుగుతున్నట్లున్నారు. అది మాత్రం చెప్పను. ఇంట్లో అందరూ ఇండస్ట్రీకి చెందినవాళ్లే కావడం నాకు ప్రొఫెషన్‌ల్‌గా చాలా హెల్ప్ అయ్యింది. రమ్యకృష్ణగారు చిన్నప్పటి నుంచి తెలుసు. డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్, కెమెరామేన్ వినోద్‌గారు తెలుసు. వినోద్‌గారి మిసెస్, మా అమ్మ ఫ్రెండ్లీగా ఉంటారు. మా నాన్నగారు నాగ్‌సార్‌తో సినిమాలు తీసిన విషయం మీకు తెలుసు. అప్పుడు నేను షూటింగ్ లొకేషన్‌కి వెళ్లేదాన్ని. చిన్నప్పుడు నాగ్‌సార్‌తో దిగిన ఫొటో నా దగ్గర ఉంది. అందరూ తెలిసినవాళ్లు కావడంతో కొత్త హీరోయిన్ అనే ఫీలింగ్ కలగలేదు. ► మీ అమ్మానాన్న షూటింగ్ లొకేషన్‌కి వచ్చేవారా? అలా దగ్గరుండి గైడ్ చేయాలనుకోలేదు. నన్ను నమ్మారు. ఫైనల్ అవుట్‌ఫుట్ చూసి వాళ్లు హ్యాపీ. ► ఇంత సన్నగా, అందంగా ఉన్నారు కదా.. బోలెడన్ని లవ్‌లెటర్స్ వచ్చి ఉంటాయేమో? ఇప్పుడిలా ఉన్నాను. స్కూల్ డేస్‌లో 80కిలోలు ఉండేదాన్ని. సో.. ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడేమైనా వస్తాయేమో చూడాలి (నవ్వుతూ). ఇంత స్లిమ్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. బేసిక్‌గా ఫుడ్ లవర్ని. ఇప్పుడు యాక్ట్రస్ అయ్యాను కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వడానికి షార్ట్ కట్స్‌ని ఫాలో అవ్వలేదు. సైక్లింగ్, బ్యాడ్మింటన్, డైట్.. వీటితోనే తగ్గా. ► ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. సినిమాలు లేకుండా నా లైఫ్‌ను ఊహించుకోలేను. ఎందుకంటే... నా చిన్నతనం అంతా సెట్స్‌లోనే గడిచింది. అమ్మానాన్నలతో లొకేషన్స్‌కి వెళ్లేదాన్ని. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సినిమా గురించే డిస్కస్ చేస్తారు. సో... ఆటోమేటిక్‌గా సినిమాల్లోకి రావాలనుకున్నాను. ► ‘హలో’లో స్క్రిప్ట్‌కి తగ్గట్టు ఎక్స్పోజింగ్ లేకుండా మామూలుగా కనిపించారు. మరి.. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే? గ్లామరస్ రోల్స్ చేస్తాను. కానీ ఆ క్యారెక్టర్ నన్ను ఇంప్రెస్ చేయాలి. ఆ కాస్ట్యూమ్స్ నాకు కంఫర్ట్‌గా అనిపించాలి. నా కంఫర్ట్ జోన్ దాటితే, మా అమ్మానాన్నలతో చర్చించి, నేను కూడా ఆలోచించి అప్పుడు నా నిర్ణయం చెబుతాను. అది యస్ అవ్వొచ్చు.. నో కూడా అవ్వొచ్చు. ► అఖిల్ గురించి? హ్యాండ్సమ్ హీరో. ఎంత బాగా యాక్ట్ చేశాడో చూసే ఉంటారు. మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. మంచి అబ్బాయి కూడా. చాలా ఫ్రెండ్లీ టైప్. నాగ్‌సార్ కూడా అంతే. అమలగారు... అందరూ అమేజింగ్. ► మీ నాన్నగారిలా మీరూ డైరెక్టర్ అవుతారా? నాకు స్క్రిప్ట్ రైటింగ్ అంటే చాలా ఇష్టం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సినిమా తీస్తానేమో. కానీ ఇప్పట్లో అలాంటి ఉద్దేశం లేదు. ప్రస్తుతం నేను చేస్తున్న పని చాలా బాగుంది. ► మీ అమ్మగారు, నాన్నగారు విడిపోవడం ఓ కూతురిగా ఎలా ఉంది? లేదండి. ఈ విషయం గురించి మాట్లాడలేను. ► నో ప్రాబ్లమ్.. మీరు ఎవరితో కలిసి ఉంటున్నారు? అమ్మ, నాన్న ఇద్దరితో నాకు మంచి అనుబంధం ఉంది. ఇద్దరితోనూ కలిసి ఉంటాను. నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి, నా ప్లస్‌లు, మైనస్‌లు వాళ్లకు బాగా తెలుసు. అందుకని ఏ విషయం అయినా ఇద్దరితోనూ సంప్రదిస్తాను. ► బుక్స్ చదువుతారా? మా తాతగారు లైబ్రేరియన్. ఆయన మా నాన్నకి బుక్స్ చదవటం అలవాటు చేశారు. ఆ అలవాటు నాకు వచ్చింది. ► మీ ఆలోచనా విధానాన్ని మార్చిన పుస్తకం ఏదైనా? ఒక్క పుస్తకం అని చెప్పటం చాలా కష్టం. ఒక్కో పుస్తకం ద్వారా జీవితాన్ని ఒక్కో కొత్త యాంగిల్లో చూస్తూ ఉంటాం. ► మీ నాన్నగారి దర్శకత్వంలో నటిస్తారా ? నాన్న నాకు నాన్నలానే ఉండాలనుకున్నారు. గురువుగా మారాలనుకోలేదు. ‘నీ డైరెక్టర్స్ నిన్ను గైడ్ చేయాలి. నువ్వు ఈ ఇండస్ట్రీలో ఉన్నావంటే అది నీవల్లే అనుకోవాలి’ అన్నారు. కావాలంటే విక్రమ్ కె. కుమార్‌గారికి నాన్న ఫోన్ చేసి ఉండొచ్చు. కానీ, ఆయన చేయలేదు. అలా చాన్స్ తెచ్చుకుంటే నాకు మాత్రం ఏం శాటిస్ఫ్యాక్షన్ ఉంటుంది. అందుకే నాన్న అన్నట్లు ముందు వేరే గురువుల దగ్గర సినిమాలు చేయాలనుకున్నా. భవిష్యత్తులో నాన్న డైరెక్షన్లో నటిస్తానేమో. ► ఫైనల్లీ.. కల్యాణిని చూసి ఏం నేర్చుకోవాలి ? నో షార్ట్ కట్.. ఓన్లీ హార్డ్ వర్క్. ► తెలుగు సినిమాలు చూస్తారా? నేను విపరీతమైన సినిమా అభిమానిని. అన్ని సినిమాలు చూస్తాను. ఫ్రెంచ్, జాపనీస్, కొరియన్ ఇలా అన్నీ. ఐ లవ్ ఇండియన్ ఫిలింస్. ఐ లవ్ ఎవ్రీథింగ్ ఎబౌట్ ఇండియన్ సినిమా. ► మీ నాన్నగారు సౌత్ అలాగే నార్త్‌లో కూడా సినిమాలు చేశారు. మీరు కూడా బాలీవుడ్‌కి కూడా వెళ్తారా ? దేవుడు ఏది ఇస్తే అదే. ‘హలో’ లాంటి లాంచ్ వస్తుందనుకోలేదు. ► మీరు దేవుణ్ణి నమ్ముతారా ? చాలా రిలీజియస్ పర్సెన్ని. ఎనర్జీస్, ఖర్మ సిద్దాంతాన్ని నమ్ముతా. ► మీరు, లిజిగారు తల్లీకూతుళ్లలా ఏదైనా సినిమాలో కనిపించే అవకాశం ఉందా? తప్పకుండా. అమ్మకి కూతురిగా స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకూ ఎగై్జటింగ్‌గా ఉంటుంది. – డి.జి. భవాని -
థియేటర్లో అగ్నిప్రమాదం
విజయనగరం టౌన్: కొత్త సినిమా తొలిరోజు.. అందులోనూ తొలిరోజు ప్రదర్శన అంటే ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. నాగార్జున కొడుకు అఖిల్ నటించిన హలో చిత్రం స్థానిక ఎన్సీఎస్ థియేటర్లో శుక్రవారం విడుదలైంది. సాయంత్రం షో మరికొన్ని నిమిషాల్లో ప్రారంభమవుతుందనగా థియటర్ తెరకి సమీపంలో ఉన్న కిటికీ పై భాగాన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు రావడం కనిపించింది. దీంతో అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది వెంటనే విద్యుత్ వైర్లకు సంబంధించిన లైన్స్‌ను నిలుపుదల చేశారు. పొగలు వచ్చే వైర్లను సేప్టీ పరికరాలను ఉపయోగించి ఆపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో థియేటర్‌కు చేరుకుని షార్ట్ సర్క్యూట్ ఎక్కడ నుంచి వచ్చిందో పరిశీలించి, అందుకు సంబంధించిన నిపుణులతో దగ్గరుండి పర్యవేక్షించారు. ఏడీఎఫ్‌ఓ మాధవనాయుడు, ఎస్ఎఫ్ఓ ఎస్.దిలీప్ కుమార్, టాస్క్‌పోర్స్ టీమ్ రెస్క్యూలో పాల్గొంది. తప్పిన ప్రమాదం కొత్త సినిమా తొలి రోజు ప్రదర్శన కావడంతో సాయంత్రం ఆటకు హాల్ ప్రేక్షకులతో నిండిపోయింది. థియేటర్లో ఏ మాత్రం అగ్ని ప్రమాదం సంభవించిన పెద్దఎత్తున తోపులాట జరిగిపోయి ఉండేది. సకాలంలో సిబ్బంది స్పందించడం, ఫైర్ సిబ్బంది రావడంతో సమస్య పరిష్కారమైంది. లేకుంటే పెనుప్రమాదమే సంభవించి ఉండేది. -
'హలో' మూవీ రివ్యూ
టైటిల్ : హలో జానర్ : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్, జగపతిబాబు, రమ్యకృష్ణ, అజయ్ సంగీతం : అనూప్ రుబెన్స్ దర్శకత్వం : విక్రమ్ కె కుమార్ నిర్మాత : నాగార్జున అక్కినేని తొలి సినిమా అఖిల్ తో నిరాశపరిచిన అక్కినేని యువ హీరో, రెండో ప్రయత్నంగా హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ సాధించాలని నాగార్జున అంతా తానే అయ్యి సినిమాను రూపొందించాడు. మనం, 24 లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలను అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ వయసుకు, ఇమేజ్ కు తగ్గ కథా కథనాలతో హలో సినిమా తెరకెక్కించారు. అంతేకాదు ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో పాటు సెంటిమెంట్ ను కూడా పక్కాగా ఫాలో అయ్యారు. అందుకే అక్కినేని ఫ్యామిలీకి మంచి రికార్డ్ ఉన్న డిసెంబర్ నెలలో సినిమాను రిలీజ్ చేశారు. మరి నాగార్జున ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..? హలో అనుకున్నట్టుగా అఖిల్ కు తొలి విజయాన్ని అందించిందా..? విక్రమ్ కె కుమార్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..? కథ : పదేళ్ల శీను (అఖిల్) ఓ అనాథ. సిగ్నల్ దగ్గర ఏక్తారా వాయిస్తూ అడుక్కుంటుంటాడు. శీను ప్లే చేసే మ్యూజిక్ విని జున్ను(కళ్యాణీ ప్రియదర్శన్) తనని ఇష్టపడుతుంది. ఇద్దరు మంచి స్నేహితులవుతారు. కానీ జున్ను వాళ్ల నాన్నకి ట్రాన్స్ఫర్ కావటంతో వారు ఢిల్లీ వెళ్లిపోతారు. వెళ్లిపోయేటప్పుడు జున్ను వంద రూపాయల నోటు మీద తన ఫోన్ నంబర్ రాసి శీను కోసం కారులోంచి విసిరేస్తుంది. ఆ నోటు శీనుకి దొరికినట్టే దొరికి చేజారిపోతుంది. అదే సమయంలో ఓ ప్రమాదంలో కలిసిన ప్రకాష్( జగపతిబాబు) సరోజిని(రమ్యకృష్ణ)లు శీనుని దత్తత తీసుకుంటారు. (సాక్షి రివ్యూస్)అవినాష్ గా పేరు మార్చి పెంచుకుంటారు. కానీ శీను మాత్రం జున్నుని మరిచిపోలేకపోతాడు. ఆమె ఏ రోజుకైనా కలుస్తుందన్న నమ్మకంతో ప్రతీ రోజు తనని కలిసిన సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. మరి శీను నిరీక్షణ ఫలించిందా..? జున్నుని తిరిగి కలిశాడా..? ఈ ప్రయత్నంలో శీను ఎదుర్కొన్న ఇబ్బందులేంటి అన్నదే కథ. నటీనటులు : తొలి సినిమాతోనే మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసి బోల్తా పడ్డ అఖిల్ రెండో సినిమాలో మాత్రం లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడు. నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. రమ్యకృష్ణ, జగపతి బాబుల కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అఖిల్ నటన కంటతడిపెట్టిస్తుంది. యాక్షన్ సీన్స్ లో అఖిల్ మూమెంట్స్ హాలీవుడ్ హీరోలను గుర్తు చేస్తాయి. (సాక్షి రివ్యూస్)హీరోయిన్ గా నటించిన కళ్యాణీ ప్రియదర్శన్ కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేం. అంతలా ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో పాటు నటనతోనూ ఫుల్ మార్క్స్ సాధించింది. అమ్మా నాన్నలుగా జగపతిబాబు రమ్యకృష్ణలు సూపర్బ్. వాళ్ల పర్ఫామెన్స్ తో సినిమా స్థాయిని పెంచారు. విలన్ గా అజయ్ ది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో తనదైన నటనతో మెప్పించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. విశ్లేషణ : మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలికి మెమరబుల్ హిట్ అందించిన విక్రమ్ కె కుమార్ అఖిల్ కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకొని మరోసారి విజయం సాధించాడు. తెలిసిన కథే అయినా.. తన కథనం, టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు అఖిల్ ను చేరువ చేశాడు. అదే సమయంలో హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ తో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దర్శకుడిగా తన వంతు పాత్రతో పాటు ఓ అద్భుతమైన టీంతో సినిమాను మరింత రిచ్ గా తీర్చిదిద్దాడు. (సాక్షి రివ్యూస్)బాబ్ బ్రౌన్ యాక్షన్ కొరియోగ్రఫి, అనూప్ మ్యూజిక్, వినోద్ సినిమాటోగ్రఫి ఇలా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవ్వటంతో హలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రంగా తరయారయ్యింది. అఖిల్ ను ఎలాగైన నిలబెట్టాలని నాగ్ ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించాడు. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ అఖిల్, కళ్యాణీల నటన యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం తెలిసిన కథ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మంజుల నిర్మాతగా నాని సినిమా
సూపర్ స్టార్ కృష్ణ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన మంజుల.. నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దర్శకురాలిగా మారి సందీప్ కిషన్ హీరోగా మనసుకు నచ్చింది పేరుతో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా స్టార్ చేసే ఆలోచనలో ఉంది మంజుల. అయితే ఆ సినిమాకు మంజుల కేవలం నిర్మాతగానే వ్యవహరించనుందట. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల ఓ సినిమాను నిర్మించనుంది. ప్రస్తుతం అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న హలో సినిమా పనుల్లో బిజీగా ఉన్న విక్రమ్, ఆ సినిమా పూర్తయిన వెంటనే తదుపరి చిత్రం పనులు మొదలుపెట్టనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
పొరుగింట్లో కల్యాణి
తమిళ సినిమా: పొరిగింటి పుల్లకూర రుచి అన్నది అనాధిగా ఉన్న నానుడి. అంటే మనింట్లో కూరు రుచిని గుర్తించలేమనేగా అర్థం. ఇది వాస్తవంగా కూడా చాలా సార్లు నిజమైంది. కమలహాసన్ వారుసురాలు శ్రుతిహాసన్ నటిగా పరిచయమైంది బాలీవుడ్లోనే. ఆ తరువాత టాలీవుడ్, ఆపై కోలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. ఒకప్పటి అందాల తార రాధ కూతురు కార్తీక మలయాళీనే. నటి రాధ మాత్రం కోలీవుడ్, టాలీవుడ్‌లలో కథానాయకిగా రాణించారు. అలాంటిది తన కూతుర్ని హీరోయిన్గా పరిచయం చేయడానికి రాధ మాలీవుడ్, కోలీవుడ్‌ల్లో చాలా ప్రయత్నాలు చేశారు. అయితే తొలుత అవకాశం వచ్చింది మాత్రం టాలీవుడ్లోనే. జోష్ అనే చిత్రంలో నాగచైతన్యకు జంటగా పరిచయమైంది. ఆ తరువాత కోలీవుడ్‌లో నటించిందనుకోండి. ఇక అతిలోక సుందరి శ్రీదేవి తన కూతురు జాన్వీని తొలుత తెలుగులో పరిచయం చేయాలని భావించారు.అయితే తాజాగా హిందీ చిత్రం ద్వారా జాన్వి పరిచయం అవుతోంది. ఇక చాలా మంది హీరోయిన్లు పొరుగు భాషా చిత్రాల ద్వారనే పరిచయమై ఆ తరువాత మాతృభాషలో అవకాశాలను అందుకున్నారు. తాజాగా కల్యాణి విషయంలోనూ ఇదే జరిగింది.ఇంతకీ కల్యాణి ఎవరో చెప్పలేదు కదూ. ప్రముఖ మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురే ఈ బ్యూటీ. కొంత కాలం క్రితం ప్రియదర్శన్, లిజీ సుమారు 25 ఏళ్లు కలిసి కాపురం చేసి ఈ మధ్యనే మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరికి ఒక కూతురు, కొడుకు.ఆ కూతురే కల్యాణి. న్యూయార్క్‌లో చదువుకుంటున్న కల్యాణిని హీరోయిన్ చేయడానికి లిజీ కోలీవుడ్‌లో చాలా ప్రయత్నాలే చేశారు. అయితే అవేవి ఫలించలేదు. అలాంటిది టాలీవుడ్ కల్యాణిని కథానాయకిగా సాగ్వతించింది. అఖిల్ హీరోగా నటించిన హలో చిత్రం ద్వారా కల్యాణి కథానాయకిగా పరిచయమవుతోంది. 24 చిత్రం ఫేమ్ విక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 22వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్రం హిట్ అయితే ఆ తరువాత కోలీవుడ్‌లో కల్యాణిని రెడ్ కార్పెట్‌తో స్వాగతిస్తుంది. -
అదే బ్యానర్లో మరో సినిమా..!
మనం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం అఖిల్ హీరోగా హలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అఖిల్ సరసన కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ సినిమా పనులు పూర్తి కాకముందే నాగార్జున.. విక్రమ్‌తో మరో సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం అఖిల్ హీరోగా హలో సినిమా తెరకెక్కిస్తున్న విక్రమ్, తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్య హీరోగా రూపొందించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. విక్రమ్ డెడికేషన్, వర్కింగ్ స్టైల్ నచ్చిన కింగ్ వరుస సినిమాలకు అవకాశం ఇస్తున్నాడట. ప్రస్తుతానికి నాగార్జున టీం నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. హలో ప్రచార కార్యక్రమాల్లోనే ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. -
కింగ్ ను ఆశ్చర్యపరిచిన పోలాండ్ కుర్రాడు
తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ అక్కినేని, త్వరలో హలో అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అక్కినేని ఫ్యామిలీ ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఇటీవల ఈ సినిమాలో ఓ వీడియో సాంగ్ కింగ్ నాగార్జున తన సోషల్ మీడియా పేజ్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ పాటపై ఓ పోలాండ్ కుర్రాడి స్పందన ఆసక్తికరంగా మారింది. గతంలో పలు తెలుగు పాటలను ఆలపించి ఇక్కడి వారికి పరిచయం అయిన జిబిగ్జ్, హలో సినిమాలోని మెరిసే మెరిసే పాటను కూడా పాడాడు. తాను పాట పాడిన వీడియోతో పాటు 'హలో అఖిల్.. నా పేరు జిబిగ్జ్. నాది పోలాండ్. మెరిసే మెరిసే పాటలో నీ పెర్ఫామెన్స్ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంది. పాట, డ్యాన్స్ టెరిఫిక్. మీ సినిమా ఘనవిజయం సాధిస్తుంది. అఖిల్, నేను నీ అభిమానిని. హలో టీంకు నా శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై స్పందించిన కింగ్ నాగార్జున 'అది అద్భుతం జిబిగ్జ్' అంటూ రిప్లై ఇచ్చారు. అఖిల్ సరసన కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు. అనూప్ రుబెన్స్ సంగీత మందిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. HELLO AKHIL This is Zbigs from Poland. MERISE MERISE MERISE.. Absolutely Electrifying performance. Song is Terrific nd so is UR DANCE AM More than sure ur film HELLO will be Smashing hit. AKHIL, Am UR adrent Admirer & I Wish HELLO a Great Success. Cheers.❤️ @AkhilAkkineni8 pic.twitter.com/mMtURnBSgU — zbigniew ( Bujji) (@ZbigsBujji) 9 December 2017 That’s awesome @ZbigsBujji ..😘 https://t.co/osWDIC9Yc1 — Nagarjuna Akkineni (@iamnagarjuna) 9 December 2017 -
‘నీకు పిచ్చిరా.. మరచిపోవాలి రా’..!
‘హలో ఈ అబ్బాయి పేరు అవినాశ్.. ఒకప్పుడు ఇతడ్ని శ్రీను అని పిలిచేవారు.. ఎవరు లేని శ్రీను లైఫ్‌లోకి అనుకోకుండా తన సోల్‌మేట్ వచ్చింది. అది అతడికి తెలిసే లోపు దూరమైపోయింది. అన్ని మనం అనుకున్నట్లు జరిగితే దేవుడికి బోర్ కొట్టేది. అవినాశ్‌గా మారిన శ్రీనుకి ఈ రోజు చాలా ఇంపార్ట్టెంట్ డే.. అనుకొని సంఘటనలు ఇతని లైఫ్‌ను ఏలా మార్చబోతున్నాయో’ అని నాగార్జున అఖిల్‌ను పరిచయం చేశారు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘హలో’ సినిమాకి విక్రమ్ కె. కుమార్ డైరెక్టర్. ‘హలో’ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘పదిహేను ఏళ్లుగా ఒక్క అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న నీకు పిచ్చిరా.. మరచిపోవాలి రా’ అని రమ్యకృష్ణ అంటోంది. అప్పుడు అఖిల్..‘ అమ్మా తను నా సోల్‌మేట్ మా’ అని చెప్పే విధానం అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ‘నేను ఎవరికైనా దగ్గరవ్వలంటే చాలా రోజుల పడుతోంది .. ఎంటో చాలా దగ్గరయ్యాను.. అమ్మకు చెప్పవు కదా నీ లైఫ్‌లో ఒక్కరు ఉన్నారిని.. అలానే నా లైఫ్‌లో ఒక్కరున్నారు’ అని రమ్యకృష్ణతో అంటారు. ‘ ఇదంతా వాడు.. ఫోన్ కోసమా !’ అని నటుడు అజయ్ ఆశ్యర్యపోతూ కనిపించారు. ఈ ట్రైలర్లో వారి సంభాషణ విన్న తర్వాత లవ్ స్టోరీతో తెరకెక్కించినట్లు అర్థమౌతోంది. నాగార్జున ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన కల్యాణి హీరోయిన్గా నటిస్తోంది. గతంలో నాగార్జున ఈ చిత్రాన్ని డిసెంబరు 22న ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘హాలో’ టీజర్: ఏ కారణం లేకుండా రచ్చ చేస్తున్నారు : అఖిల్
కాపీరైట్ ఆరోపణలతో ‘హాలో’ సినిమా టీజర్‌ను యూట్యూబ్ తొలగించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై హీరో అఖిల్ స్పందించారు. ‘హాలో’ మూవీ టీజర్‌కు సోషల్ మీడియాలో 80లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. మా టీజర్‌పై వచ్చిన తప్పుడు కాపీరైట్ క్లయిమ్పై నిర్మాతలుగా మేం స్పందించాల్సిన అవసరముంది. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం రియల్లీ స్లోమోషన్‌తో కొలబారేట్ అయినందుకు మేం గర్వపడుతున్నాం. ఏ కారణం లేకుండా ఈ విషయంలో రచ్చ చేస్తున్నారు’ అని అఖిల్ ట్వీట్ చేశారు. అఖిల్ అక్కినేని నటించిన రెండో చిత్రం ‘హలో’ .. ఇటీవల విడుదలైన ఈ టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అఖిల్ షేర్ చేసిన యూట్యూబ్ అకౌంట్ నుండి ఈ టీజర్‌ని కాపీరైట్ క్రింద యూట్యూబ్ తొలగించింది. కాపీరైట్ నోటీసు అందడంతో యూట్యూబ్ ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను కాపీ చేయడం వల్లే.. యూట్యూబ్ టీజర్‌ను తొలగించిందని, మ్యూజిక్ కాపీ చేస్తే యూట్యూబ్ నుంచి చర్యలు తప్పవని టాలీవుడ్లో వినిపిస్తోంది. అయితే, ఈ వివాదానికి తెరదించుతూ యూట్యూబ్ హాలో మూవీ టీజర్‌ను మళ్లీ సైట్లో రీస్టోర్ చేసింది. మరోవైపు ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ.. ఏ కారణం లేకుండా రచ్చ చేస్తున్నారని అఖిల్ తాజాగా ట్వీట్ చేశారు. 8 million and counting on social media💪🏻 As producers of the film we have to clarify the false copyright claim on our teaser. We are proud to have collaborated with really slow motion for an amazing background score. Pheww! What havoc for no reason! https://t.co/IqHcBSb8zT pic.twitter.com/TI8kr2Cfv1 — Akhil Akkineni (@AkhilAkkineni8) 29 November 2017 -
హలో టీజర్ వచ్చేసింది
సాక్షి, సినిమా : అక్కినేని యంగ్ హీరో అఖిల్ కొత్త సినిమా హలో టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక టీజర్ విషయానికొస్తే.. మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. చిన్నతనంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు.. పెద్దయ్యాక ఆ అమ్మాయిని వెత్కుకుంటూ అన్వేషణ కొనసాగించే యువకుడి పాత్రలో అఖిల్ కనిపించబోతున్నాడని హింట్ ఇచ్చేశారు. టీజర్‌కు తగ్గట్లు అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఇక చివర్లో అఖిల్ హల్లో అని చెప్పే సింగిల్ డైలాగ్ మాత్రమే ఉంది. జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తోంది. డిసెంబర్ 22న హలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. -
హల్లో... ఓ చిన్న సర్ ప్రైజ్
సాక్షి, సినిమా : అక్కినేనివారి యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన రెండో చిత్రం హల్లో షూటింగ్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. స్వయంగా నాగ్ దగ్గరుండి మరీ అఖిల్ విషయంలో మరోసారి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వెరైటీగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తర్వాత ఈ మధ్యే కొన్ని ఆన్ లోకేషన్ ఫోటోలు విడుదల కావటం చూశాం. ఇక ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణం ఎక్కడిదాకా వచ్చిందో చెబుతూ రేపు అంటే మంగళవారం ఓ చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారంట. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా తన ట్విట్టర్ లో కాసేపటి క్రితం తెలియజేశాడు. అంతేకాదు డిసెంబర్ 22నే చిత్రం రిలీజ్ అవుతుందంటూ మరోసారి గట్టిగా చెబుతూ చివరల్లో యాష్ ట్యాగ్ కూడా పెట్టేశాడు. HELLO! And now it’s about that time to show you guys what We’ve been upto. Stay tuned tomorrow for a little surprise:))))). #Helloondec22nd — Akhil Akkineni (@AkhilAkkineni8) November 13, 2017 అయితే నాగ్ వాయిస్ ఓవర్‌తో ఓ చిన్న టీజర్ లాంటి బిట్‌ను వదిలే ఛాన్స్ ఉందని.. అదే సర్ప్రైజ్ అని ఫిల్మ్ నగర్ టాక్. అఖిల్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తుండగా.. అనూప్ స్వరాలను అందిస్తున్నాడు. -
ఎన్టీఆర్, రాజమౌళి, నాగ్.. కన్ఫర్మ్ చేశారు
- వినూత్నంగా అఖిల్ రెండో సినిమా టైటిల్ ప్రకటన - టాప్ హీరో,హీరోయిన్లతో ‘హలో’ వీడియో హైదరాబాద్: అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్‌పై అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తోన్న సినిమా టైటిల్‌ను వినూత్న రీతిలో ప్రకటించారు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘హలో’ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ మేరకు నిర్మాత అక్కినేని నాగార్జున తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో... హీరోలు తారక్, ప్రభాస్, నాగచైతన్య, రాంచరణ్, వరుణ్‌తేజ్, సూర్య, నాని, వెంకటేశ్, దర్శకుడు రాజమౌళి, నాగార్జునలతోపాటు హీరోయిన్లు కాజల్, శ్రుతి హాసన్, సమంత, రకుల్‌ప్రీత్‌లు ‘హలో..’ అంటూ అఖిల్-2 టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారు. చివర్లో దివంగత ఏఎన్ఆర్కూడా ‘హలో..హలో..’ అంటూ అలరిస్తారు. రెండు రోజుల కిందట.. ‘నిర్ణయం’లోని ‘హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం...’ పాటను ట్వీట్ చేసిన నాగార్జున... ‘‘ఇందులో అఖిల్ సినిమా టైటిల్ ఉంది. కనుక్కోండి’’ అంటూ అభిమానులను ఊరించారు. ఆ ఉత్కంఠకు తెరదించుతూ నేడు సినిమా పేరు ‘హలో..’ అని ప్రకటించారు.