'హలో' మూవీ రివ్యూ | Akhil Hello Movie review | Sakshi
Sakshi News home page

Dec 22 2017 1:10 PM | Updated on Dec 22 2017 1:35 PM

Akhil Hello Movie review - Sakshi

తొలి సినిమా అఖిల్ తో నిరాశపరిచిన అక్కినేని యువ హీరో, రెండో ప్రయత్నంగా హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ సాధించాలని

టైటిల్ : హలో
జానర్ : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్
తారాగణం : అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్, జగపతిబాబు, రమ్యకృష్ణ, అజయ్
సంగీతం : అనూప్ రుబెన్స్
దర్శకత్వం : విక్రమ్ కె కుమార్
నిర్మాత : నాగార్జున అక్కినేని

తొలి సినిమా అఖిల్ తో నిరాశపరిచిన అక్కినేని యువ హీరో, రెండో ప్రయత్నంగా హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ సాధించాలని నాగార్జున అంతా తానే అయ్యి సినిమాను రూపొందించాడు. మనం, 24 లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలను అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ వయసుకు, ఇమేజ్ కు తగ్గ కథా కథనాలతో హలో సినిమా తెరకెక్కించారు. అంతేకాదు ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో పాటు సెంటిమెంట్ ను కూడా పక్కాగా ఫాలో అయ్యారు. అందుకే అక్కినేని ఫ్యామిలీకి మంచి రికార్డ్ ఉన్న డిసెంబర్ నెలలో సినిమాను రిలీజ్ చేశారు. మరి నాగార్జున ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..? హలో అనుకున్నట్టుగా అఖిల్ కు తొలి విజయాన్ని అందించిందా..? విక్రమ్ కె కుమార్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..?

కథ :
పదేళ్ల శీను (అఖిల్) ఓ అనాథ. సిగ్నల్ దగ్గర ఏక్‌తారా వాయిస్తూ అడుక్కుంటుంటాడు. శీను ప్లే చేసే మ్యూజిక్ విని జున్ను(కళ్యాణీ ప్రియదర్శన్) తనని ఇష్టపడుతుంది. ఇద్దరు మంచి స్నేహితులవుతారు. కానీ జున్ను వాళ్ల నాన్నకి ట్రాన్స్‌ఫర్ కావటంతో వారు ఢిల్లీ వెళ్లిపోతారు. వెళ్లిపోయేటప్పుడు జున్ను వంద రూపాయల నోటు మీద తన ఫోన్ నంబర్ రాసి శీను కోసం కారులోంచి విసిరేస్తుంది. ఆ నోటు శీనుకి దొరికినట్టే దొరికి చేజారిపోతుంది. అదే సమయంలో ఓ ప్రమాదంలో కలిసిన ప్రకాష్( జగపతిబాబు) సరోజిని(రమ్యకృష్ణ)లు శీనుని దత్తత తీసుకుంటారు. (సాక్షి రివ్యూస్)అవినాష్ గా పేరు మార్చి పెంచుకుంటారు. కానీ శీను మాత్రం జున్నుని మరిచిపోలేకపోతాడు. ఆమె ఏ రోజుకైనా కలుస్తుందన్న నమ్మకంతో ప్రతీ రోజు తనని కలిసిన సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. మరి శీను నిరీక్షణ ఫలించిందా..? జున్నుని తిరిగి కలిశాడా..? ఈ ప్రయత్నంలో శీను ఎదుర్కొన్న ఇబ్బందులేంటి అన్నదే కథ.

నటీనటులు :
తొలి సినిమాతోనే మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప‍్రయత్నం చేసి బోల్తా పడ్డ అఖిల్ రెండో సినిమాలో మాత్రం లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడు. నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. రమ్యకృష్ణ, జగపతి బాబుల కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో  అఖిల్ నటన కంటతడిపెట్టిస్తుంది. యాక్షన్ సీన్స్ లో అఖిల్ మూమెంట్స్ హాలీవుడ్ హీరోలను గుర్తు చేస్తాయి. (సాక్షి రివ్యూస్)హీరోయిన్ గా నటించిన కళ్యాణీ ప్రియదర్శన్ కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేం. అంతలా ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో పాటు నటనతోనూ ఫుల్ మార్క్స్ సాధించింది. అమ్మా నాన్నలుగా జగపతిబాబు రమ్యకృష్ణలు సూపర్బ్. వాళ్ల పర్ఫామెన్స్ తో సినిమా స్థాయిని పెంచారు. విలన్ గా అజయ్ ది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో తనదైన నటనతో మెప్పించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.

విశ్లేషణ :
మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలికి మెమరబుల్ హిట్ అందించిన విక్రమ్ కె కుమార్ అఖిల్ కెరీర్ ను గాడిలో పెట‍్టే బాధ్యత తీసుకొని మరోసారి విజయం సాధించాడు. తెలిసిన కథే అయినా.. తన కథనం, టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు అఖిల్ ను చేరువ చేశాడు. అదే సమయంలో హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ తో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దర్శకుడిగా తన వంతు పాత్రతో పాటు ఓ అద్భుతమైన టీంతో సినిమాను మరింత రిచ్ గా తీర్చిదిద్దాడు. (సాక్షి రివ్యూస్)బాబ్ బ్రౌన్ యాక్షన్ కొరియోగ్రఫి, అనూప్ మ్యూజిక్, వినోద్ సినిమాటోగ్రఫి ఇలా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవ్వటంతో హలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రంగా తరయారయ్యింది. అఖిల్ ను ఎలాగైన నిలబెట్టాలని నాగ్ ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించాడు.

ప్లస్ పాయింట్స్ :
ఎమోషనల్ సీన్స్
అఖిల్, కళ్యాణీల నటన
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా నెమ్మదించిన కథనం
తెలిసిన కథ

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement