![Akhil to announce third film details soon - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2018/01/5/Akhil%20Akkineni.jpg.webp?itok=TkraJnmB)
హలో సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అక్కినేని యువ నటుడు అఖిల్, ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అఖిల్ సినిమాతో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో లాంగ్ గ్యాప్ తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమాతో ఆకట్టుకున్నాడు. వారసుడికి ఎలాగైన హిట్ ఇవ్వాలన్న కసితో అక్కినేని నాగార్జున అంతా తానే అయి ఈ సినిమాను రూపొందించాడు.
హలో సక్సెస్ సాధించటంతో ఇప్పుడు అఖిల్ తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది. తాజాగా అఖిల్ కూడా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై స్పందించాడు. జనవరి 10న మూడో సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తానని తెలిపాడు. ఇప్పటికే అఖిల్ నెక్ట్స్ సినిమా కోసం బోయపాటి శ్రీను, సుకుమార్ లతో చర్చలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అఖిల్ మూడో సినిమాను ఎవరు నిర్మించనున్నారు, దర్శకుడు ఎవరు అన్న విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment