‘టారస్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్’ పేరుతో ప్రతి సంవత్సరం వరల్డ్ మూవీస్‌లోని బెస్ట్ స్టంట్ పెర్ఫార్మర్స్‌కు అవార్డ్స్ ప్రకటిస్తారు. ఈ ఉత్సవం లాస్ ఏంజెల్స్‌లో జరుగుతుంది. విశేషం ఏంటంటే.. ‘బెస్ట్ యాక్షన్ ఇన్ ఏ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ’లో ‘హలో’ సినిమా నామినేట్ అయింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ మాట్లాడుతూ – ‘‘హలో’ సినిమా ‘టారస్ వరల్డ్ అవార్డ్స్ క్యాటగిరీలో నామినేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నాగార్జున సార్, యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్, కెమెరామేన్ పీయస్ వినోద్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్‌లకు థ్యాంక్స్.
ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగా రావడానికి మీరంతా కారణం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అఖిల్.. నీ డెడికేషన్, హార్డ్ వర్క్, నీ యాటీట్యూడ్ నిన్ను కొత్త హైట్స్‌కు తీసుకువెళ్తాయి. ఎప్పుడూ ఇలానే ఉండు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. నామినేషన్ అయితే సంపాదించుకుంది కానీ ‘హలో’కి అవార్డు దక్కలేదు. చైనీస్ మూవీ ‘ఉల్ఫ్ వారియర్ 2’కి అవార్డు దక్కింది. ఏది ఏమైనా ‘ప్రపంచ సినిమాలు’ పోటీ పడే అవార్డ్స్‌లో ఓ ఇండియన్ మూవీ నామినేషన్ వరకూ వెళ్లడం గొప్ప అని సినిమా లవర్స్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment