ఎన్టీఆర్‌, రాజమౌళి, నాగ్‌.. కన్ఫర్మ్‌ చేశారు | Akkineni Akhil second movie titled Hello officially announced | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌, రాజమౌళి, నాగ్‌.. కన్ఫర్మ్‌ చేశారు

Published Mon, Aug 21 2017 8:23 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

ఎన్టీఆర్‌, రాజమౌళి, నాగ్‌.. కన్ఫర్మ్‌ చేశారు - Sakshi

ఎన్టీఆర్‌, రాజమౌళి, నాగ్‌.. కన్ఫర్మ్‌ చేశారు

- వినూత్నంగా అఖిల్‌ రెండో సినిమా టైటిల్‌ ప్రకటన
- టాప్‌ హీరో,హీరోయిన్లతో ‘హలో’  వీడియో


హైదరాబాద్‌:
అన్నపూర్ణ స్టుడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని వారసుడు అఖిల్‌ హీరోగా నటిస్తోన్న సినిమా టైటిల్‌ను వినూత్న రీతిలో ప్రకటించారు. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘హలో’ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ మేరకు నిర్మాత అక్కినేని నాగార్జున తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు.

వీడియోలో... హీరోలు తారక్‌, ప్రభాస్‌, నాగచైతన్య, రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌, సూర్య, నాని, వెంకటేశ్‌, దర్శకుడు రాజమౌళి, నాగార్జునలతోపాటు హీరోయిన్లు కాజల్‌, శ్రుతి హాసన్‌, సమంత, రకుల్‌ప్రీత్‌లు ‘హలో..’ అంటూ అఖిల్‌-2 టైటిల్‌ను కన్ఫార్మ్‌ చేశారు. చివర్లో దివంగత ఏఎన్‌ఆర్‌కూడా ‘హలో..హలో..’ అంటూ అలరిస్తారు. రెండు రోజుల కిందట.. ‘నిర్ణయం’లోని ‘హలో గురూ ప్రేమ కోసమేరోయ్‌ జీవితం...’ పాటను ట్వీట్‌ చేసిన నాగార్జున... ‘‘ఇందులో అఖిల్‌ సినిమా టైటిల్‌ ఉంది. కనుక్కోండి’’  అంటూ అభిమానులను ఊరించారు. ఆ ఉత్కంఠకు తెరదించుతూ నేడు సినిమా పేరు ‘హలో..’ అని ప్రకటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement