ఆ ఒక్క సెంటిమెంట్ ఫాలో అవుతున్నా!
♦ నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. నా గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ టైమ్‌లో సూరిగారు (సురేందర్ రెడ్డి) ‘ఏజెంట్’ కథ చెప్పారు. నాకూ నచ్చింది. దాంతో వెంటనే అనౌన్స్ చేశాం. అయితే స్క్రిప్ట్ పూర్తి కావడానికి, నా లుక్ మార్చుకోవడం, లాక్‌డౌన్ వంటి వాటి వల్ల ఈ సినిమా ఆలస్యమైంది.
♦ ‘ఏజెంట్’లో నేను రామకృష్ణ (రిక్కీ) అనే పాత్ర చేశాను. రిక్కీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ‘ఏజెంట్’ ఒక మంచి స్పై డ్రామా. సురేందర్ రెడ్డిగారు ప్రతిదీ ఫైన్ ట్యూన్ చేస్తారు. నేను ఆయన్ను బ్లైండ్‌గా ఫాలో అయ్యాను. ఇక సెకండాఫ్‌లో వచ్చే టార్చర్ సీన్ కోసం చాలా కష్టపడ్డాను.
♦సాధారణంగా నేను సెంటిమెంట్స్‌ను నమ్మను. అయితే ఏప్రిల్ 28న ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ వంటి ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు విడుదలయ్యాయి. ఇలాంటి హిట్ సినివలు విడుదలైన ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ సినిమా విడుదల అవుతోంది. ఈ సెంటి మెంట్‌ను మాత్రం ఫాలో అవుతున్నాను.
♦నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా కల. అది నాన్నగారి వందో సినిమా అయితే నాకు ఇంకా సంతోషం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. కానీ నాకు తెలిసి అలాంటి స్క్రిప్ట్ ఏదీ ఫైనలైజ్ కాలేదు. ‘ఏజెంట్’ సినిమా ట్రైలర్ చూసి, నేను చాలా కష్టపడ్డానని తెలిసి మా అమ్మగారు (అక్కినేని అమల) ఎమోషన్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment