హలో.. నేను అక్కడ అమ్మాయిని అయినా మీరు ఇక్కడి అమ్మాయి అనే అనుకోవచ్చు. హలో.. నన్ను పరిచయం చేసిన తెలుగు తెర అంటే నాకు బాగా ఇష్టం. హలో.. ఫస్ట్ సినిమాతో నాకు మంచి మార్కులేసినందుకు థ్యాంక్స్. హలో.. ఎప్పటికీ మీ ప్రేమాభిమానాలు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా.. అంటున్నారు కల్యాణీ ప్రియదర్శన్ డాటరాఫ్ నటి లిజీ–దర్శకుడు ప్రియదర్శన్. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ‘హలో’లో అఖిల్ సరసన మెరిసిన ఈ మలయాళ మందారంతో స్పెషల్ టాక్.
► తెలుగు ఆడియన్స్‌కి హలో చెప్పడం ఎలా ఉంది?
(నవ్వుతూ). హలో యూనివర్శల్. ఫోన్ తీస్తే.. కామన్‌గా అందరూ అనేది అదే. అలాంటి ఓ యూనివర్శల్ వర్డ్ ఉన్న టైటిల్‌తో తెలుగువారిని పలకరించడం హ్యాపీగా ఉంది.
► ‘హలో’ లాంటి పెద్ద లాంచ్‌ను ఎక్స్‌పెక్ట్ చేశారా ?
లేదు. అందులోనూ తెలుగు ఇండస్ట్రీలో. ‘హలో’ కోసం చాలారోజులు హీరోయిన్‌ని వెతికారని తెలుసు. పీయస్ వినోద్ (కెమెరామ్యాన్) వాళ్ళ వైఫ్‌కి, మా ఫ్యామిలీకి ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నారు. నాగ్‌సార్ వాళ్ళకి కూడా వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలా నన్ను రికమండ్ చేశారు. నా ఫొటో ఫేస్‌బుక్‌లో చూసినట్టు ఉన్నారు. మా నాన్న దగ్గర డైరెక్టర్ విక్రమ్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేశారు. ఆయనకు నేను తెలుసు. కథకి సూట్ అవుతానని, ఆడిషన్స్‌కి పిలిచారు. అలా తెలుగు ఆడియన్స్‌కి హలో చెప్పే చాన్స్ వచ్చింది.
► ఫస్ట్ కెమెరా వెనక.. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఎలా ఉంది ఫీలింగ్?
వెరీ డిఫరెంట్. రెండు ప్రపంచాల్లో ఉన్నట్లు ఉంది. మొదట్లో కొంచెం నెర్వస్ అయ్యాను. కానీ, దర్శకుడు విక్రమ్‌గారితో పాటు సెట్ మెంబర్స్ అంతా హెల్ప్ చేశారు. దాంతో ఈజీ అనిపించింది.
► అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాగుందా? హీరోయిన్‌గా కంఫర్ట్‌గా ఉందా?
దేని ప్రెజర్ దానికి ఉంటుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఆర్ట్ డైరెక్టర్‌కు అసిస్టెంట్‌గా చేసేదాన్ని. ప్రొడక్షన్ డిజైనింగ్ చేసేవాళ్లం. సెట్లో ఉంటూ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా చూసుకోవాలి. నాకు డస్ట్ అలర్జీ ఉండటం వల్ల తరచూ సిక్ అవుతూ ఉండేదాన్ని. ఇక, హీరోయిన్‌గా అంటే ఉదయం నాలుగు గంటలకే షూటింగ్ ఉంటుంది. రోజు మొత్తంలో జస్ట్ నాలుగు గంటలే నిద్రపోయినా పది గంటలు పడుకున్నంత ప్రెష్‌గా కనిపించాలి. ఫిజిక్ గురించి పట్టించుకోవాలి. అందంగా కనిపించాలి. ఇవన్నీ కెమెరా వెనక తీసుకునే జాగ్రత్తలు. కెమెరా ముందుకెళ్లాక యాక్టింగ్ విషయంలో పర్‌ఫెక్షన్ చూపించాలి. ఏ జాబ్ అయినా కొన్ని కష్టాలు ఉంటాయి. అయితే మనం ఎంజాయ్ చేయగలిగితే ఏదీ కష్టం అనిపించదు.
► హీరోయిన్ కావాలని ఎప్పుడు అనుకున్నారు?
ఆ ఆలోచన చిన్నప్పటి నుంచీ ఉంది. కానీ యాక్టింగ్ ఫీల్డ్ అంత ఈజీ కాదని తెలుసు. కెమెరా ముందు ఎంత బాగా యాక్ట్ చేసినా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రాకుండా చూసుకోవడానికి చాలా హోమ్‌వర్క్ చేయాలి. బట్... పర్సనల్‌గా మొదట్లో నేను చాలా సెన్సిటివ్. ఎవరైనా విమర్శిస్తే అంత ఈజీగా తీసుకోలేకపోయేదాన్ని. బాగా బాధపడేదాన్ని. ఏడ్చేదాన్ని. అంత సాఫ్ట్. ఇండస్ట్రీలో ఇలా ఉంటే కష్టం అని తెలుసు. అందుకే ఇక్కడికొచ్చాక నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను.
► అంటే.. ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యారా?
ఇప్పుడంటే ఇప్పుడు కాదు. లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పర్సనల్‌గా స్ట్రాంగ్ అవుతున్నాను.
► ఏదైనా ఇన్సిడెంట్స్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేశాయా?
ప్రత్యేకమైన సంఘటనలు జరగలేదు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాల్సిందే కదా. సింగపూర్‌లో చదువుకున్నాను. తర్వాత అమెరికా వెళ్లాను. అవన్నీ నా సొంత నిర్ణయాలే. అంత దూరం వెళ్లి, ఒంటరిగా ఉన్న మనం స్ట్రాంగ్ కాకపోవడం ఏంటి? అంటే... మనంతట మనం సాఫ్ట్ అనుకుంటున్నామా? అనే ఆలోచన మొదలైంది. నా బలం తెలుసుకున్నాను.
► టీనేజ్‌లో హీరోయిన్ అయ్యారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది?
ఇన్‌డైరెక్ట్‌గా ఏజ్ అడుగుతున్నట్లున్నారు. అది మాత్రం చెప్పను. ఇంట్లో అందరూ ఇండస్ట్రీకి చెందినవాళ్లే కావడం నాకు ప్రొఫెషన్‌ల్‌గా చాలా హెల్ప్ అయ్యింది. రమ్యకృష్ణగారు చిన్నప్పటి నుంచి తెలుసు. డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్, కెమెరామేన్ వినోద్‌గారు తెలుసు. వినోద్‌గారి మిసెస్, మా అమ్మ ఫ్రెండ్లీగా ఉంటారు. మా నాన్నగారు నాగ్‌సార్‌తో సినిమాలు తీసిన విషయం మీకు తెలుసు. అప్పుడు నేను షూటింగ్ లొకేషన్‌కి వెళ్లేదాన్ని. చిన్నప్పుడు నాగ్‌సార్‌తో దిగిన ఫొటో నా దగ్గర ఉంది. అందరూ తెలిసినవాళ్లు కావడంతో కొత్త హీరోయిన్ అనే ఫీలింగ్ కలగలేదు.
► మీ అమ్మానాన్న షూటింగ్ లొకేషన్‌కి వచ్చేవారా?
అలా దగ్గరుండి గైడ్ చేయాలనుకోలేదు. నన్ను నమ్మారు. ఫైనల్ అవుట్‌ఫుట్ చూసి వాళ్లు హ్యాపీ.
► ఇంత సన్నగా, అందంగా ఉన్నారు కదా.. బోలెడన్ని లవ్‌లెటర్స్ వచ్చి ఉంటాయేమో?
ఇప్పుడిలా ఉన్నాను. స్కూల్ డేస్‌లో 80కిలోలు ఉండేదాన్ని. సో.. ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడేమైనా వస్తాయేమో చూడాలి (నవ్వుతూ). ఇంత స్లిమ్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. బేసిక్‌గా ఫుడ్ లవర్‌ని. ఇప్పుడు యాక్ట్రస్ అయ్యాను కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వడానికి షార్ట్ కట్స్‌ని ఫాలో అవ్వలేదు. సైక్లింగ్, బ్యాడ్మింటన్, డైట్.. వీటితోనే తగ్గా.
► ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే..
సినిమాలు లేకుండా నా లైఫ్‌ను ఊహించుకోలేను. ఎందుకంటే... నా చిన్నతనం అంతా సెట్స్‌లోనే గడిచింది. అమ్మానాన్నలతో లొకేషన్స్‌కి వెళ్లేదాన్ని. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సినిమా గురించే డిస్కస్ చేస్తారు. సో... ఆటోమేటిక్‌గా సినిమాల్లోకి రావాలనుకున్నాను.
► ‘హలో’లో స్క్రిప్ట్‌కి తగ్గట్టు ఎక్స్‌పోజింగ్ లేకుండా మామూలుగా కనిపించారు. మరి.. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే?
గ్లామరస్ రోల్స్ చేస్తాను. కానీ ఆ క్యారెక్టర్ నన్ను ఇంప్రెస్ చేయాలి. ఆ కాస్ట్యూమ్స్ నాకు కంఫర్ట్‌గా అనిపించాలి. నా కంఫర్ట్ జోన్ దాటితే, మా అమ్మానాన్నలతో చర్చించి, నేను కూడా ఆలోచించి అప్పుడు నా నిర్ణయం చెబుతాను. అది యస్ అవ్వొచ్చు.. నో కూడా అవ్వొచ్చు.
► అఖిల్ గురించి?
హ్యాండ్‌సమ్ హీరో. ఎంత బాగా యాక్ట్ చేశాడో చూసే ఉంటారు. మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. మంచి అబ్బాయి కూడా. చాలా ఫ్రెండ్లీ టైప్. నాగ్‌సార్ కూడా అంతే. అమలగారు... అందరూ అమేజింగ్.
► మీ నాన్నగారిలా మీరూ డైరెక్టర్ అవుతారా?
నాకు స్క్రిప్ట్ రైటింగ్ అంటే చాలా ఇష్టం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సినిమా తీస్తానేమో. కానీ ఇప్పట్లో అలాంటి ఉద్దేశం లేదు. ప్రస్తుతం నేను చేస్తున్న పని చాలా బాగుంది.
► మీ అమ్మగారు, నాన్నగారు విడిపోవడం ఓ కూతురిగా ఎలా ఉంది?
లేదండి. ఈ విషయం గురించి మాట్లాడలేను.
► నో ప్రాబ్లమ్.. మీరు ఎవరితో కలిసి ఉంటున్నారు?
అమ్మ, నాన్న ఇద్దరితో నాకు మంచి అనుబంధం ఉంది. ఇద్దరితోనూ కలిసి ఉంటాను. నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి, నా ప్లస్‌లు, మైనస్‌లు వాళ్లకు బాగా తెలుసు. అందుకని ఏ విషయం అయినా ఇద్దరితోనూ సంప్రదిస్తాను.
► బుక్స్ చదువుతారా?
మా తాతగారు లైబ్రేరియన్. ఆయన మా నాన్నకి బుక్స్ చదవటం అలవాటు చేశారు. ఆ అలవాటు నాకు వచ్చింది.
► మీ ఆలోచనా విధానాన్ని మార్చిన పుస్తకం ఏదైనా?
ఒక్క పుస్తకం అని చెప్పటం చాలా కష్టం. ఒక్కో పుస్తకం ద్వారా జీవితాన్ని ఒక్కో కొత్త యాంగిల్‌లో చూస్తూ ఉంటాం.
► మీ నాన్నగారి దర్శకత్వంలో నటిస్తారా ?
నాన్న నాకు నాన్నలానే ఉండాలనుకున్నారు. గురువుగా మారాలనుకోలేదు. ‘నీ డైరెక్టర్స్ నిన్ను గైడ్ చేయాలి. నువ్వు ఈ ఇండస్ట్రీలో ఉన్నావంటే అది నీవల్లే అనుకోవాలి’ అన్నారు. కావాలంటే విక్రమ్ కె. కుమార్‌గారికి నాన్న ఫోన్ చేసి ఉండొచ్చు. కానీ, ఆయన చేయలేదు. అలా చాన్స్ తెచ్చుకుంటే నాకు మాత్రం ఏం శాటిస్‌ఫ్యాక్షన్ ఉంటుంది. అందుకే నాన్న అన్నట్లు ముందు వేరే గురువుల దగ్గర సినిమాలు చేయాలనుకున్నా. భవిష్యత్తులో నాన్న డైరెక్షన్‌లో నటిస్తానేమో.
► ఫైనల్లీ.. కల్యాణిని చూసి ఏం నేర్చుకోవాలి ?
నో షార్ట్ కట్.. ఓన్లీ హార్డ్ వర్క్.
► తెలుగు సినిమాలు చూస్తారా?
నేను విపరీతమైన సినిమా అభిమానిని. అన్ని సినిమాలు చూస్తాను. ఫ్రెంచ్, జాపనీస్, కొరియన్ ఇలా అన్నీ. ఐ లవ్ ఇండియన్ ఫిలింస్. ఐ లవ్ ఎవ్రీథింగ్ ఎబౌట్ ఇండియన్ సినిమా.
► మీ నాన్నగారు సౌత్ అలాగే నార్త్‌లో కూడా సినిమాలు చేశారు. మీరు కూడా బాలీవుడ్‌కి కూడా వెళ్తారా ?
దేవుడు ఏది ఇస్తే అదే. ‘హలో’ లాంటి లాంచ్ వస్తుందనుకోలేదు.
► మీరు దేవుణ్ణి నమ్ముతారా ?
చాలా రిలీజియస్ పర్సెన్‌ని. ఎనర్జీస్, ఖర్మ సిద్దాంతాన్ని నమ్ముతా.
► మీరు, లిజిగారు తల్లీకూతుళ్లలా ఏదైనా సినిమాలో కనిపించే అవకాశం ఉందా?
తప్పకుండా. అమ్మకి కూతురిగా స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకూ ఎగై్జటింగ్‌గా ఉంటుంది.
– డి.జి. భవాని
హలో... నేను చాలా స్ట్రాంగ్
Published Sun, Dec 24 2017 12:48 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment