దర్శకుడు ప్రియదర్శన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణి విభిన్న పాత్రలు పోషిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. హీరోయిన్‌గా రాణిస్తోంది. నటిగా గుర్తింపులో ఆమె ఎంచుకుంటున్న పాత్రలు.. ఆమె అభినయం తోడవుతుంటే.. హీరోయిన్‌గా రాణించడానికి మాత్రం ఆమె అనుసరిస్తున్న ఫ్యాషన్ అండ్ స్టయిలే హెల్ప్ అవుతున్నాయి. అలా హెల్ప్ అవుతున్న బ్రాండ్స్‌లో కొన్నిటి గురించి..
దీప్తి..
హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ దీప్తి పోతినేని.. 1980ల నాటి ఫ్యాషన్‌ను పునః సృష్టించడంలో సిద్ధహస్తురాలు. అప్పటి పట్టు, ప్యూర్ ఆర్గంజా, టిష్యూ, కాటన్ ఫ్యాబ్రిక్స్‌తో రూపొందించే యూనిక్ డిజైనర్ చీరలు దీప్తిని ఎయిటీస్ స్పెషలిస్ట్ డిజైనర్‌గా నిలబెట్టాయి. ఎక్కువగా సంప్రదాయ ఎంబ్రాయిడరీనే వాడుతుంటుంది. ఈ మధ్యనే తన పేరు మీదే హైదరాబాద్‌లో ఓ ఫ్యాషన్ హౌస్‌నూ ప్రారంభించింది. డిజైన్ ను బట్టే ధరలు ఉంటాయి.. వేల నుంచి లక్షల్లో! ఆన్ లైన్ లోనూ లభ్యం.
కళ్యాణ్ జ్యూలర్స్..
టాప్–100 విలాసవంతమైన బ్రాండ్స్‌లో కల్యాణ్ జ్యూలర్స్ ఒకటి. 1908లో ప్రారంభమైన ఈ సంస్థకు ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రముఖ నగరాల్లో మొత్తం 150 బ్రాంచ్‌లున్నాయి. సరికొత్త డిజైన్సే దీని బ్రాండ్ వాల్యూ అయితే కొనుగోలుదారుల నమ్మకం ఈ బ్రాండ్‌కి యాడెడ్ వాల్యూ. నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.
జ్యూలరీ బ్రాండ్: కల్యాణ్ జ్యూలర్స్
ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
చీర డిజైనర్: దీప్తి (రూ.52,800)
కంఫర్ట్ జోన్‌లో గ్రోత్ ఉండదు. గ్రోత్ జోన్‌లో కంఫర్ట్ ఉండదు. నేను ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా. అందుకే అప్పుడప్పుడు.. ఎంచుకునే పాత్రల్లో, ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేస్తుంటా!
– కల్యాణీ ప్రియదర్శన్.
ఇవి చదవండి: హెల్త్: 'మెగా షేప్ మసాజర్' తో.. ఫిట్‌నెస్ సెంటర్స్‌కి చెక్!
Comments
Please login to add a commentAdd a comment