
అఖిల్ అక్కినేని, మేఘా ఆకాష్
హలో సినిమాతో ఆకట్టుకున్న అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా లై ఫేం మేఘా ఆకాష్ ను తీసుకోవాలని భావిస్తున్నారట.
ఇప్పటి వరకు చేసిన రెండు సినిమాల్లో కొత్త హీరోయిన్లతో నటించిన అఖిల్ మూడో సినిమాలో మాత్రం ఫాంలో ఉన్న హీరోయిన్‌తో రొమాన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి ఎలాగైన కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నాడు అక్కినేని వారసుడు.
Comments
Please login to add a commentAdd a comment