హలో టీజర్‌ వచ్చేసింది | Akhil Hello teaser Released | Sakshi
Sakshi News home page

హలో టీజర్‌ విడుదల

Published Thu, Nov 16 2017 7:39 PM | Last Updated on Thu, Nov 16 2017 8:03 PM

Akhil Hello teaser Released - Sakshi

సాక్షి, సినిమా : అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌ కొత్త సినిమా హలో టీజర్‌ కాసేపటి క్రితం విడుదలైంది. మనం ఫేమ్‌ విక్రమ్‌ కే కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక టీజర్‌ విషయానికొస్తే.. మొత్తం యాక్షన్‌ సన్నివేశాలతో నింపేశారు. చిన్నతనంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు.. పెద్దయ్యాక ఆ అమ్మాయిని వెత్కుకుంటూ అన్వేషణ కొనసాగించే యువకుడి పాత్రలో అఖిల్‌ కనిపించబోతున్నాడని హింట్ ఇచ్చేశారు. టీజర్‌కు తగ్గట్లు అనూప్‌ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఆకట్టుకుంది.

ఇక చివర్లో అఖిల్ హల్లో అని చెప్పే సింగిల్‌ డైలాగ్‌ మాత్రమే ఉంది. జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 22న హలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement