థియేటర్ వెలుపల ఆందోళనతో ఉన్న ప్రేక్షకులు
విజయనగరం టౌన్: కొత్త సినిమా తొలిరోజు.. అందులోనూ తొలిరోజు ప్రదర్శన అంటే ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. నాగార్జున కొడుకు అఖిల్ నటించిన హలో చిత్రం స్థానిక ఎన్‌సీఎస్ థియేటర్‌లో శుక్రవారం విడుదలైంది. సాయంత్రం షో మరికొన్ని నిమిషాల్లో ప్రారంభమవుతుందనగా థియటర్ తెరకి సమీపంలో ఉన్న కిటికీ పై భాగాన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు రావడం కనిపించింది. దీంతో అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది వెంటనే విద్యుత్ వైర్లకు సంబంధించిన లైన్స్‌ను నిలుపుదల చేశారు. పొగలు వచ్చే వైర్లను సేప్టీ పరికరాలను ఉపయోగించి ఆపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో థియేటర్‌కు చేరుకుని షార్ట్ సర్క్యూట్ ఎక్కడ నుంచి వచ్చిందో పరిశీలించి, అందుకు సంబంధించిన నిపుణులతో దగ్గరుండి పర్యవేక్షించారు. ఏడీఎఫ్‌ఓ మాధవనాయుడు, ఎస్‌ఎఫ్‌ఓ ఎస్.దిలీప్ కుమార్, టాస్క్‌పోర్స్ టీమ్ రెస్క్యూలో పాల్గొంది.
తప్పిన ప్రమాదం
కొత్త సినిమా తొలి రోజు ప్రదర్శన కావడంతో సాయంత్రం ఆటకు హాల్ ప్రేక్షకులతో నిండిపోయింది. థియేటర్‌లో ఏ మాత్రం అగ్ని ప్రమాదం సంభవించిన పెద్దఎత్తున తోపులాట జరిగిపోయి ఉండేది. సకాలంలో సిబ్బంది స్పందించడం, ఫైర్ సిబ్బంది రావడంతో సమస్య పరిష్కారమైంది. లేకుంటే పెనుప్రమాదమే సంభవించి ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment