కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్‌లో అగ్ని ప్రమాదం! | Fire Accident In Kalyan Ram Movie Shooting Set In Hyderabad, 4 Crores Loss | Sakshi
Sakshi News home page

Kalyan Ram: సెట్‌లో అగ్ని ప్రమాదం.. కోట్లాది రూపాయల నష్టం!

Published Fri, May 10 2024 1:52 PM | Last Updated on Fri, May 10 2024 3:06 PM

Kalyan Ram Movie Set Fire Accident 4 Crores Loss

హీరో కల్యాణ్ రామ్ కొత్త సినిమా షూటింగ్‌లో అ‍గ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు రూ.4 కోట్లు విలువైన సెట్ కాలి బూడిద అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ సంఘటన వల్ల నిర్మాతకు కూడా భారీ నష్టం వాటిల్లందని టాక్.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)

కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్.. గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. సీబీఐకి సంబంధించిన సీన్స్ తీస్తున్నారు. 9 రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, మరో రోజు చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సెట్ మొత్తం కాలిపోయింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement