అమీ-తుమీ టీజర్‌ వచ్చేసింది | amee-timee teaser released | Sakshi
Sakshi News home page

అమీ-తుమీ టీజర్‌ వచ్చేసింది

Published Mon, Apr 17 2017 6:45 PM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM

అమీ-తుమీ  టీజర్‌ వచ్చేసింది - Sakshi

అమీ-తుమీ టీజర్‌ వచ్చేసింది

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో  రూపొందిన మల్టీస్టారర్ "అమీ తుమీ" టీజర్  సోమవారం విడుదల చేశారు.  నేచురల్ స్టార్ నాని దీన్ని అధికారికంగా లాంచ్‌ చేశారు.  డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ  పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్‌ ఆ సక్తికరంగా ఉంది. టాప్‌ కమెడియన్‌ తనదైన కామెడీతో అలరించనున్నారు.  ఈ సందర్భంగా  ఇంద్రగంటి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన హీరో నానీ  టీజర్‌ లింక్‌ను  ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు.   టీజర్‌ సూపర్‌ ఫన్‌గా ఉందంటూ ట్వీట్‌ చేశారు.

కాగా కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోబిజీగా ఉంది. అద్భుతమైన కామెడీ ఎంటర్ టైనర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న "అమీ తుమీ" తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకొనేలా చేస్తుందని చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు ఇటీవల ప్రకటించారు. మే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని   చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.  అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, వెన్నెల కిషోర్‌ తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement