Ami Tumi
-
ఉగాది ‘సమ్మోహనం’
యువ నటుడు సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సమ్మోహనం. ఇటీవల అమీతుమీ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించిన మోహనకృష్ణ, సమ్మోహనంతో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ లోగోను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఉగాది సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. రేపు ఉదయం 9 గంటలకు ఈ పోస్టర్ విడుదల కానుంది. సుధీర్ సరసన అదితీరావ్ హైదరీ హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాకు వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. Ugadi Special poster from #Sammohanam will be releasing tomorrow at 9 am #UgadiSammohanam #HappyUgadi@isudheerbabu @aditiraohydari @mokris_1772 #VivekSagar @vidyasivalenka pic.twitter.com/FQVG64ErhQ — sridevimoviesofficial (@SrideviMovieOff) 17 March 2018 -
వినోదాత్మక చిత్రాలకు ఆదరణ
కాకినాడ కల్చరల్ : వినోదాత్మక చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ మెండుగా ఉంటుందని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. స్థానిక పద్మప్రియ థియేటర్‌ను గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘అమీతుమీ’ చిత్ర బృందం శనివారం సాయంత్రం సందడి చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హిరోలు వెన్నెల కిషోర్, అడవి శేషు, హిరోయిన్ అదితి మైకెల్, నటి కూమారి శ్యామల మాట్లాడుతూ ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మక నిర్మించామన్నారు. చిత్ర దర్శకులు ఇంద్రగంటి మోహాన్ కృష్ణ మాట్లాడుతూ అన్ని హంగులతో చిత్ర నిర్మించడంతో హిట్ అయిందన్నారు. ముందుగా థియేటర్ మేనేజర్ నానాజీ చిత్ర బృందానికి çపుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.గీతా చిన్ని, గీతా ప్రోడక్షన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
'అమీ తుమీ' మూవీ రివ్యూ
టైటిల్ : అమీ తుమీ జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అడవిశేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకల్, తనికెళ్ల భరణి సంగీతం : మణిశర్మ దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి నిర్మాత : కె.సి. నరసింహారావు జంధ్యాల తరువాత తెలుగు వెండితెరపై అలాంటి ఆరోగ్యకరమైన కామెడీ పండిస్తున్న అతి కొద్ది మంది దర్శకుల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి ఒకరు. మధ్యలో జెంటిల్‌మేన్ లాంటి సీరియస్ సినిమా చేసినా మరోసారి తన మార్క్ హెల్దీ కామెడీతో ఆడియన్స్‌కు కితకితలు పెట్టేందుకు అమీ తుమీతో రెడీ అయ్యారు. అడవి శేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటించిన అమీ తుమీ మోహనకృష్ణ గత చిత్రాల మాదిరిగా ఆకట్టుకుందా..? సీరియస్ స్టైలిష్ రోల్స్ చేసే అడవి శేష్ కామెడీ పండించాడా..? కామెడీ చేసే వెన్నెల కిశోర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు ఎంత వరకు సూట్ అయ్యాడు..? అవసరాల శ్రీనివాస్ మరోసారి తన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడా..? కథ : అమీ తుమీ మూడు జంటల ప్రేమకథ. సినిమా మొదలవ్వటానికి ముందే ప్రేమలో ఉన్న అనంత్(అడవి శేష్), దీపిక(ఈషా)ల పెళ్లికి దీపిక తండ్రి జనార్థన్(తనికెళ్ల భరణి) ఒప్పుకోడు, తాను చూసిన శ్రీ చిలిపి( వెన్నెల కిశోర్)నే పెళ్లి చేసుకోవాలని చెప్పి దీపికను గదిలో బంధిస్తాడు. అంతేకాదు తనకు వ్యాపారంలో నమ్మకద్రోహం చేసిన గంగాధర్ కూతురు మాయ(అదితి మైకల్)ను తన కొడుకు విజయ్(అవసరాల శ్రీనివాస్) ప్రేమిస్తున్నాడని తెలిసి కొడుకుని ఇంట్లో నుంచి బయటకు పంపేస్తాడు. గదిలో ఉన్న దీపిక, పనిమనిషి కుమారి(శ్యామల) సాయంతో తప్పించుకొని పారిపోతుంది. అదే సమయంలో గంగాధర్ కూతురు.. మాయ కూడా ఆస్తి కోసం సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక ఇల్లు వదిలి బయటకు వచ్చేస్తుంది. తరువాత వీరిద్దరు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు..? దీపిక ను చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు శ్రీ చిలిపి ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరోలుగా అడవి శేష్, అవసరాల శ్రీనివాస్ కనిపించినా.. సినిమా అంతా వెన్నెల కిశోర్ షోలా నడిచింది. తన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు కిశోర్. తాను సీరియస్ గా ఉంటూనే కామెడీ చేసి బ్రహ్మానందం లాంటి సీనియర్లను గుర్తు చేశాడు. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ తనికెళ్ల భరణి, తన మార్క్ తెలంగాణ యాసలో కితకితలు పెట్టాడు. కూతురి ప్రేమను కాదని తన స్వార్థం కోసం తనకు నచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేయాలనే క్రూరమైన తండ్రి పాత్రలో కూడా మంచి కామెడీ పండించాడు. అడవి శేష్, వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకేల్, కేదార్ శంకర్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మరోసారి తనదైన హాస్య కథతో అలరించాడు. హాస్యం అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్, పేరడీలే అనుకుంటున్న సమయంలో కుటుంబసమేతంగా చూడదగ్గ ఆరోగ్యకరమైన హాస్య కథా చిత్రాలతో అలరిస్తున్న మోహన కృష్ణ, మరోసారి అదే తరహా ప్రేమ కథలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమా స్థాయిని పెంచాయి. తెలంగాణ యాసలో తనికెళ్ల భరణి, ఇంగ్లీష్, తెలుగు కలిపి వెన్నెల కిశోర్ చెప్పిన డైలాగ్స్‌కు థియేటర్లో విజిల్స్ పడతాయి. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు మరో ఎసెట్. సాధారణ సన్నివేశాలతో కూడా మణి తన మ్యూజిక్ మరింత ఫన్నీగా మార్చేశాడు. పిజీ విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంటేష్ ఎడిటింగ్ సినిమాను రిచ్‌గా ప్రెజంట్ చేశాయి. అమీ తుమీ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఆరోగ్యకరమైన కామెడీ ఎంటర్టైనర్. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
'క్యాచ్ చేయగలనో లేదో అని భయపడ్డాను'
నటించిన అతికొద్ది చిత్రాలతోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న నటుడు అడివి శేష్. త్వరలో అనంత్ గా 'అమీ తుమీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 9న విడుదలకానున్న 'అమీ తుమీ' గురించి అడివి శేష్ చెప్పిన విశేషాలు.. అనంత్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.. నా కెరీర్ లో నేను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటించడం ఇదే మొదటిసారి. అసలు నేను కామెడీ చేయగలనా అనే అనుమానం నాకే ఉండేది. అయితే.. మోహనకృష్ణ ఇంద్రగంటిగారు "నువ్వు చేయగలవ్" అని చెప్పి నాతో అనంత్ పాత్ర చేయించారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్ లాంటి నటుల స్థాయిలో కామెడీ పండించగలనో లేదో అని భయపడ్డాను.. కానీ ఇంద్రగంటి గారి వల్ల బాగానే చేశాననిపించింది. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులే చెప్పాలి. విజన్ మొత్తం ఇంద్రగంటిగారిదే.. నేను, అవసరాల, వెన్నెల కిషోర్, తనికెళ్లభరణి.. నాలుగురమూ దర్శకులమే. మేం నలుగురం కలిసి ఒక సినిమాలో నటించడం వలన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కు చేతులు ఎక్కువ పడ్డాయని చాలామంది అనుకొన్నారు. కానీ.. సినిమాలో విజన్ మొత్తం ఇంద్రగంటిగారిదే. ఆయన ప్రతి పాత్రను తీర్చిదిద్దిన తీరు.. కామెడీని పండించిన విధానం "అమీ తుమీ"లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రొమాన్స్ చేయగలుగుతానో లేదో అనే సందేహపడేవారు.. "పంజా" చేస్తున్నప్పుడు "నీ మొహానికి విలన్ ఏంట్రా?" అనేవారు. ఆ తర్వాత "కిస్" సినిమా చేస్తున్నప్పుడు "రొమాన్స్ చేయగలవా" అన్నారు. ఇప్పుడు "అమీ తుమీ"కి కూడా అదే "నేను కామెడీ చేయగలనా?" అనే సందేహం నాతోపాటు చాలామంది వ్యక్తపరచారు. సో ఆ సినిమాల రిజల్ట్స్ చూశాం. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ చూడాలి. క్షణం కెరీర్ కి పెద్ద మైనస్ అయిపోద్దనేవారు.. "క్షణం" సినిమాలో నాకు ఒక కూతురు ఉంటుంది అంటే.. ఇప్పుడే కదా కెరీర్ స్టార్ట్ అయ్యింది అప్పుడే తండ్రి పాత్ర ఏమిట్రా, కెరీర్ కి ప్రోబ్లమ్ అవుతుంది అనేవారు. కానీ.. నేను నమ్మకంతో ఆ సినిమా చేశాను. రిజల్ట్ మీ అందరికీ తెలిసిందే. ఒక నటుడిగా పాత్రను పండించడమే నాకు తెలుసు, అంతే తప్ప.. అది ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది నేను పట్టించుకోను. బాహుబలి బ్రతికించింది.. అప్పటికే "కిస్" సినిమా ఫ్లాప్ అయ్యి మానసికంగా కృంగిపోయి ఉన్న తరుణంలో "బాహుబలి" సినిమాలో ఆఫర్ లభించడం ఆ సినిమా విడుదలయ్యాక నాకు మంచి పేరు లభించడంతో కాస్త నిలదొక్కుకున్నాను. ఆయనుండడం వల్లే నాకు పేరొచ్చింది.. "పంజా" సినిమాలో పవన్ కళ్యాణ్ గారికంటే నా క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అయ్యింది అని చాలామంది అంటుంటారు. కానీ.. వాళ్ళందరికీ చెప్పదలుచుకొనేది ఒక్కటే.. "ఆయన ఉండడం వల్లే నేను హైలైట్ అయ్యాను, నాకు పేరొచ్చింది". డైరెక్షన్ చేస్తాను కానీ.. మళ్ళీ డైరెక్షన్ చేస్తారా అంటే.. చేస్తా కానీ అందులో నటించను. ఒక 40-50 కథలున్నాయి నా దగ్గర. అయితే.. వాటిలో పనికొచ్చేవి ఎన్ని అనేది మాత్రం తెలియదు! -
సెన్సార్ పూర్తి చేసుకొన్న 'అమీ తుమీ'
ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ 'అమీ తుమీ'. వెన్నెలకిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 'యు' సర్టిఫికెట్ అందుకొంది. కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. 'మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన బాణీలన్నీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ట్రైలర్‌కు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇంద్రగంటి గారు మంచి ఎంటర్ టైనర్‌గా 'అమీ తుమీ' చిత్రాన్ని తెరకెక్కించారు. అవసరాల, అడివి శేష్‌ల క్యారెక్టర్, వెన్నెల కిషోర్ నెగిటివ్ షేడ్‌లో పండించే కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలిస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామ'న్నారు. -
హీరోగా చేయనని ఆయన దగ్గర ఒట్టేశా!
‘‘ఓ పెళ్లికి హాజరైన నేను... అడివి శేష్, అవసరాల శ్రీనివాస్‌ల ప్రేమ కథల మధ్యలోకి ఎలా వెళతాను? రెండు రోజుల్లో నా జీవితంలో ఏం జరుగుతుంది? అన్నది వినోదంగా ఉంటుంది. కథపరంగా చూస్తే నేను విలన్’’ అని నటుడు ‘వెన్నెల’ కిశోర్ అన్నారు. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితీ మ్యాకల్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కేసీ నరసింహారావు నిర్మించిన ‘అమీ తుమీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ‘వెన్నెల’ కిశోర్ పలు విశేషాలు పంచుకున్నారు. ‘అమీ తుమీ’లో హీరోలతో సమానమైన పాత్ర నాది. నా పాత్రలో కొన్ని నెగెటివ్ షేడ్స్ ఉన్నా, అవన్నీ ఫన్నీగానే ఉంటాయి. నా గత చిత్రాల్లో కామెడీకి, ఈ చిత్రానికీ తేడా ఉంటుంది. ‘జెంటిల్మన్’ తర్వాత ఇంద్రగంటి గారి దర్శకత్వంలో చేసిన సినిమా ఇది. ఆయన స్క్రిప్ట్ ముందుగానే ఇచ్చేయడంతో ప్రాక్టీస్ చేశా. దాంతో కెమెరా ముందు నటించడం పెద్ద కష్టమనిపించలేదు. ఇప్పటికే 150 సినిమాలు చేశా. నాకు రావాల్సిన పేరుకంటే ఎక్కువే వచ్చేసిందేమో అనిపిస్తుంటుంది. ఒకప్పుడు థియేటర్లలో ఏ హీరోలకైతే విజిల్స్ వేశానో ఇప్పుడు ఆ హీరోల పక్కనే నటిస్తుండటం సంతోషంగా ఉంది. ∙నేను హీరోగా సెట్టవ్వను. ‘నువ్వు కామెడీ బాగా చేస్తున్నావ్. హీరోగా మాత్రం చేయనని మాటివ్వు’’ అని షూటింగ్లో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు అన్నారు. హీరోగా చేయనని నేనూ ఆయనకు ఒట్టేశా. -
ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు?
ఓ అబ్బాయికి రెండు పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఆల్రెడీ ఓ అమ్మాయి ప్రేమలో పడితే... మరో అమ్మాయి ప్రేమకు దూరంగా ప్రశాంతంగా బతకాలనుకుంటుంది. మరి వేరొకరితో పెళ్లంటే... ఈ అమ్మాయిలను ప్రేమించినోళ్లు అంత ఈజీగా వదలరు కదా! ఇక్కడా అదే జరిగింది. అప్పుడా అబ్బాయి ఎవర్ని పెళ్లి చేసుకున్నాడనే కథతో రూపొందుతోన్న సినిమా ‘అమీ తుమీ’. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై కేసీ నరసింహారావు నిర్మిస్తున్నారు. సోమవారం దర్శకుడు ఇంద్రగంటి బర్త్‌డే సందర్భంగా ‘అమీ తుమీ’ టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ‘‘టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. ఈషా, అదితీ మ్యాకల్ హీరోయిన్లుగా, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్, సంగీతం: మణిశర్మ . -
అమీ-తుమీ టీజర్ వచ్చేసింది
ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ "అమీ తుమీ" టీజర్ సోమవారం విడుదల చేశారు. నేచురల్ స్టార్ నాని దీన్ని అధికారికంగా లాంచ్ చేశారు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ ఆ సక్తికరంగా ఉంది. టాప్ కమెడియన్ తనదైన కామెడీతో అలరించనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన హీరో నానీ టీజర్ లింక్‌ను ట్విట్టర్ లో షేర్ చేశారు. టీజర్ సూపర్ ఫన్‌గా ఉందంటూ ట్వీట్ చేశారు. కాగా కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోబిజీగా ఉంది. అద్భుతమైన కామెడీ ఎంటర్ టైనర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న "అమీ తుమీ" తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకొనేలా చేస్తుందని చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు ఇటీవల ప్రకటించారు. మే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, వెన్నెల కిషోర్ తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. -
అమీ తుమీ టీజర్ వచ్చేసింది..!
-
నాని చేతుల మీదుగా అమీ తుమీ..
రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలను తెరకెక్కించే ఇంద్రగంటిమోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా అమీ తుమీ. అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిశోర్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన అమీ తుమీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ను దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా యంగ్ హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులతో పాటు హీరో నాని పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా, అదితి మాయకల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. -
'అమీ తుమీ' ఫస్ట్ లుక్
రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలను తెరకెక్కించే ఇంద్రగంటిమోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా అమీ తుమీ. అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిశోర్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా, అదితి మాయకల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. -
అమీ తుమీ
అవసరాల శ్రీనివాస్ – అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘అమీ తుమీ’ అనే టైటిల్ నిర్ణయించారు. ‘వెన్నెల’ కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా, అదితీ మ్యాకల్ కథానాయికలు. కహాన్–కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కె.సి.నరసింహారావు మాట్లాడుతూ –‘‘హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఉంటుంది. అందరూ తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. ఈ నెల 23తో టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలో పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అనంత్, మధుమణి, శ్యామల, తనికెళ్ల భార్గవ్, తడివేలు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా పి.జి.విందా, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్.