
సమ్మోహనం సినిమాలో సుధీర్ బాబు, అదితి రావ్ హైదరీ
యువ నటుడు సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సమ్మోహనం. ఇటీవల అమీతుమీ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించిన మోహనకృష్ణ, సమ్మోహనంతో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ లోగోను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఉగాది సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. రేపు ఉదయం 9 గంటలకు ఈ పోస్టర్ విడుదల కానుంది. సుధీర్ సరసన అదితీరావ్ హైదరీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాకు వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Ugadi Special poster from #Sammohanam will be releasing
— sridevimoviesofficial (@SrideviMovieOff) 17 March 2018
tomorrow at 9 am #UgadiSammohanam #HappyUgadi@isudheerbabu @aditiraohydari @mokris_1772 #VivekSagar @vidyasivalenka pic.twitter.com/FQVG64ErhQ