హీరోగా చేయనని ఆయన దగ్గర ఒట్టేశా! | I'm not acting hero character | Sakshi
Sakshi News home page

హీరోగా చేయనని ఆయన దగ్గర ఒట్టేశా!

Published Wed, May 24 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

హీరోగా చేయనని ఆయన దగ్గర ఒట్టేశా!

హీరోగా చేయనని ఆయన దగ్గర ఒట్టేశా!

‘‘ఓ పెళ్లికి హాజరైన నేను... అడివి శేష్, అవసరాల శ్రీనివాస్‌ల ప్రేమ కథల మధ్యలోకి ఎలా వెళతాను? రెండు రోజుల్లో నా జీవితంలో ఏం జరుగుతుంది? అన్నది వినోదంగా ఉంటుంది. కథపరంగా చూస్తే నేను విలన్‌’’ అని నటుడు ‘వెన్నెల’ కిశోర్‌ అన్నారు. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితీ మ్యాకల్, ‘వెన్నెల’ కిశోర్‌ ముఖ్య పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కేసీ నరసింహారావు నిర్మించిన ‘అమీ తుమీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ‘వెన్నెల’ కిశోర్‌ పలు విశేషాలు పంచుకున్నారు.

‘అమీ తుమీ’లో హీరోలతో సమానమైన పాత్ర నాది. నా పాత్రలో కొన్ని నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్నా, అవన్నీ ఫన్నీగానే ఉంటాయి. నా గత చిత్రాల్లో కామెడీకి, ఈ చిత్రానికీ తేడా ఉంటుంది. ‘జెంటిల్‌మన్‌’ తర్వాత ఇంద్రగంటి గారి దర్శకత్వంలో చేసిన సినిమా ఇది. ఆయన స్క్రిప్ట్‌ ముందుగానే ఇచ్చేయడంతో ప్రాక్టీస్‌ చేశా. దాంతో కెమెరా ముందు నటించడం పెద్ద కష్టమనిపించలేదు.

ఇప్పటికే 150 సినిమాలు చేశా. నాకు రావాల్సిన పేరుకంటే ఎక్కువే వచ్చేసిందేమో అనిపిస్తుంటుంది. ఒకప్పుడు థియేటర్లలో ఏ హీరోలకైతే విజిల్స్‌ వేశానో ఇప్పుడు ఆ హీరోల పక్కనే నటిస్తుండటం సంతోషంగా ఉంది. ∙నేను హీరోగా సెట్టవ్వను. ‘నువ్వు కామెడీ బాగా చేస్తున్నావ్‌. హీరోగా మాత్రం చేయనని మాటివ్వు’’ అని షూటింగ్‌లో డైరెక్టర్‌ రాఘవేంద్రరావు గారు అన్నారు. హీరోగా చేయనని నేనూ ఆయనకు ఒట్టేశా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement