రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల
‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమాకి, నా పాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటం హ్యాపీగా ఉంది. మా మూవీ ఆడియన్స్‌కి మంచి థ్రిల్ ఇస్తోంది’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్‌లో, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘సినిమా స్క్రీన్‌ప్లే చాలా అద్భుతంగా ఉంది, చివరి 40 నిమిషాలు కట్టిపడేస్తోంది, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనే ప్రశంసలు వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘తొలి ప్రయత్నంగా నిర్మించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’తో సక్సెస్ సాధించాననుకుంటున్నాను’’ అని వెన్నపూస రమణారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment