
'అమీ తుమీ' ఫస్ట్ లుక్
రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలను తెరకెక్కించే ఇంద్రగంటిమోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా అమీ తుమీ. అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిశోర్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా, అదితి మాయకల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.