సినిమా దర్శకుడిగా చేస్తున్నా! | Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie First Release | Sakshi

సినిమా దర్శకుడిగా చేస్తున్నా!

Jan 2 2022 4:57 AM | Updated on Jan 2 2022 4:57 AM

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie First Release - Sakshi

మహేంద్ర, కృతీ శెట్టి, సుధీర్‌బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ, రవిశంకర్‌

‘‘ఇంద్రగంటిగారి డైరెక్షన్‌లో చేసిన ‘సమ్మోహనం’లో సినిమాలు ఇష్టపడని వ్యక్తి పాత్ర చేశా. ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో సినిమా డైరెక్టర్‌ పాత్ర చేస్తున్నాను. ఇది రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌’’ అన్నారు సుధీర్‌బాబు. గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.

సుధీర్‌బాబు, కృతీ శెట్టి జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శనివారం జరిగిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ఆవిష్కరణ వేడుకలో నిర్మాత వై. రవిశంకర్‌ మాట్లాడుతూ– ‘‘ఇంద్రగంటì గారు అన్ని జానర్స్‌లో సినిమాలు చేయగలరు. సుధీర్‌ టాలెంటెడ్‌ హీరో. ఇక ఆ అమ్మాయి (కృతి) ఎంత మంచి నటో ‘ఉప్పెన’ సినిమాలో చూపించాం. ‘ఆ అమ్మాయి..’ నిర్మాణంలో మేం భాగస్వాములు కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఒక అబ్బాయి జీవితాన్ని ఒక అమ్మాయి ఎలా ప్రభావితం చేస్తుంది? వీళ్లు ఎలా ప్రేమలో పడ్డారు? ఆ ప్రేమకు ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఎదురైన ఇబ్బందులను అధిగమించి ప్రేమతో పాటు వాళ్లు అనుకున్నది ఎలా సాధించారనేది ఈ చిత్రకథ’’ అన్నారు. ‘‘మన ఇరుగు పొరుగింట్లో జరిగినంత సహజంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు కృతి. మైత్రీ మూవీ మేకర్స్‌ సీఈవో చెర్రీ, ఛాయాగ్రాహకుడు పీజీ విందా పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement