
చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచిన మణిరత్నం ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాతో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు ఒకేసారి హిందీలోనూ ఓ సినిమాకు ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడన్న ప్రచారం జరిగింది. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో నాని మరో హీరోగా నటించనున్నాడన్న టాక్ వినిపించింది.
ఈ వార్తలపై దర్శకుడు మణిరత్నం క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తెలుగు, హిందీ భాషల నుంచి ఎవరినీ ఎంపిక చేయలేదని తెలిపారు. హీరోయిన్లుగా సీనియర్ నటి జ్యోతికతో పాటు ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు. మణి ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ లు అదనపు ఆకర్షణలుగా నిలువనున్నాయి. మద్రాస్ టాకీస్ బ్యానర్ పై 17వ సినిమాగా మణిరత్నం స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment