తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైంది : నాని | Hero Nani intresting tweet | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైంది : నాని

Published Tue, Sep 5 2017 1:50 PM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైంది : నాని

తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైంది : నాని

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన సినీ కెరీర్ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ' తొమ్మిదేళ్ల క్రితం ఈ రోజు.. నా కుటుంబం పెరగటం ప్రారంభమైంది. అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. నన్ను మీ సొంత వాడిగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు' అంటూ హౌస్ ఫుల్ బోర్డ్ ముందు నిలబడి దిగిన ఫోటోను ట్వీట్ చేశాడు నాని.

సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని, ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టా చమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత కెరీర్ లో అటుపోట్లు చూసినా.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ఆకట్టుకున్న నాని ప్రస్తుతం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో నటిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement