‘అ!’లో కాజల్ | Kajal Aggarwal First look in AWE | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 31 2017 11:23 AM | Last Updated on Sun, Dec 31 2017 11:57 AM

Kajal Aggarwal First look in AWE - Sakshi

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి రూపొందిస్తున్న సినిమా ‘అ!’. విభిన్న కథతో, ఆసక్తికరమై నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా నాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అ!’... నటీనటులను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ వస్తున్నాడు.

నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్, ఇషా రెబ్బా, రెజీనా, మురళీ శర్మ, ప్రియదర్శిలతో పాటు సినిమాలో కీలక పాత్ర పోషించే ఓ చేప, చెట్టు పాత్రలను కూడా ఇప్పటికే పరిచయం చేశారు. తాజాగా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న కాజల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు ‘అ!’ యూనిట్. గులాబి పువ్వుతో ఉన్న కాజల్ ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయకుండా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. ‘అ!’లో ఆమె క్యారెక్టర్ గురించి హింట్ ఇస్తూ నిర్జీవ ఆత్మ అంటూ పరిచయం చేశారు. ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement