యంగ్ హీరో నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రశాంత్ వర్మకు ఆఫర్‌లు కూడా బాగానే వచ్చాయి.
ఇటీవల కల్కి సినిమాతో మరోసారి ఆకట్టుకున్న ప్రశాంత్, త్వరలో అ! సినిమాకు సీక్వెల్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కూడా కమర్షియల్ ఫార్మాట్‌లో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తోనే రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment