‘అ!’ అనిపించేలా ‘కల్కి’ | Rajasekhar Kalki Title Motion Poster | Sakshi
Sakshi News home page

Aug 26 2018 11:24 AM | Updated on Aug 26 2018 11:26 AM

Rajasekhar Kalki Title Motion Poster - Sakshi

నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అ!. లఘు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలో సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారు.

1983 నేపథ్యంలో క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైటిల్‌ లోగోను రాఖీ పండుగ సందర్భంగా ఆదివారం రిలీజ్‌ చేశారు. శ్రీ మహా విష్ణువు దశావతారాలకు సంబంధించిన వివిధ వస్తువులతో ఈ టైటిల్‌ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. నిర్మాత సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement