
హీరో నాని తాజా చిత్రం టక్ జగదీష్. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్దమైంది. అయితే ఓటీటీలో తన సినిమాను రిలీజ్ చేయడంపై నాని మొదటి నుంచి అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ ఓటీటీ విడుదలపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు నాని మాట్లాడుతూ.. ‘నా సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయలనుకున్నాను. ఎందుకంటే సినిమాను థియేటర్‌లోనే చూడటానికే నేను ఇష్టపడతా. కానీ నిర్మాతలు ఈ సినిమాకు ఎక్కువ ఖర్చు చేశారు. దీంతో ఈ మూవీ విడుదలపై మేకర్స్ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమయంలో థియేటర్లో టక్ జగదీష్ విడుదల కావడం వల్ల వారిపై భారం పడే అవకాశం ఉంది. అందువల్లే వారిని నేను ఇబ్బంది పెట్టకూడదనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని వాళ్లకే వదిలేస్తున్న. అయితే టక్ జగదీష్ ఎక్కడ విడుదలైన అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా టక్ జగదీష్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో 37 కోట్ల రూపాయలకు మేకర్స్‌తో ఢీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే 8 కోట్ల రూపాలయకు శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకున్నట్లు వినికిడి. అంతేగాక హిందీ డబ్బింగ్ రైట్స్‌కు మరో రూ. 5 కోట్లు, ఆడియో రైట్స్‌ను దక్కించుకునేందుకు ఆదిత్య మ్యూజిక్ రూ. 2 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా టక్ జగదీష్ రూ. 52 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment