
నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీశ్. షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఏప్రిల్‌లో విడుదలకు సిద్దమైన ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉండగా మేకర్స్ త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి వస్తుండటంతో త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో వీలైనంత త్వరలోనే టక్ జగదీశ్ మూవీని విడుదలకు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.
‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ విడుదల ఎప్పడేప్పుడా అని అభిమాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుచేత థియేటర్లు తెరుచుకోగానే తొలి చిత్రంగా టక్ జగదీశ్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారుట. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, టీజర్, పాటలకు విశేష స్పంది వచ్చిన సంగతి తెలిసిందే. షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం నానికి అన్నయ్యగా విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment