అఖిల్ తరువాత నానితో..! | Nani next movie with manam fame vikram kumar | Sakshi
Sakshi News home page

అఖిల్ తరువాత నానితో..!

Sep 28 2017 1:58 PM | Updated on Sep 28 2017 2:53 PM

hero Nani Vikram Kumar

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎమ్సీఏ సినిమాతో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. వీటిలో ఎమ్సీఏ ముందుగా విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న నాని, మరో సినిమాకు కమిట్ అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. 24, మనం చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం అఖిల్ హీరోగా హలో సినిమాను రూపొందిస్తున్న విక్రమ్, డిసెంబర్ లో ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. అఖిల్ సినిమా తరువాత నాని హీరోగా సినిమాను పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నాడు విక్రమ్ కుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement