బాలీవుడ్‌ బ్యూటీతో అఖిల్‌..! | Farah Karimaee Special Song In Akhil New Film | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 18 2018 9:58 AM | Last Updated on Wed, Jul 18 2018 12:02 PM

Farah Karimaee Special Song In Akhil New Film - Sakshi

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ ప్రస్తుతం తన మూడో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. హాలో పరవాలేదనిపించిన ఈ యంగ్ హీరో మూడో సినిమాతో ఎలాగైన మంచి విజయాన్ని సాధించాలని కష్టపడుతున్నాడు. తొలి ప్రేమ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో బాలీవుడ్ నటి ఫరా కరిమీ ఆడిపాడనుందట. ధృవ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన ఈ బ్యూటి అఖిల్ సరసన స్పెషల్ సాంగ్‌ చేసేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంగ్లాండ్‌లో జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement