
నాగార్జున- నాని
నాచురల్ స్టార్ నానీ, కింగ్ అక్కినేని నాగార్జునలు కలిసి మల్టీ స్టారర్ మూవీ చిత్రాన్ని చేస్తున్న విషయం విదితమే. ఇదివరకే సినిమా షూటింగ్ ప్రారంభమై చిన్నపాటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. శమంతకమణి, భలే మంచి రోజు సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. ఈ మల్టీ స్టారర్ మూవీకి కూడా శ్రీరామ్ ఆదిత్యనే డైరెక్టర్.
ఈ చిత్రంలో నాని, నాగ్‌లకు జోడిగా ఎవరు నటిస్తారనే దానిపై పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు హీరోయిన్‌లు రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లను సెలక్ట్ చేశారు దర్శక నిర్మాతలు. వీరిలో రష్మిక మందన్న నానితో జతకడితే.. కింగ నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment