Buzz: Mohan Raja Do Multi Starrer With Akkineni Nagarjuna, Akhil - Sakshi
Sakshi News home page

‘మెగా’ డైరెక్టర్‌తో ‘అక్కినేని’మల్టీస్టారర్‌.. స్క్రిప్ట్‌ రెడీ!

Published Sun, Oct 9 2022 9:06 AM | Last Updated on Sun, Oct 9 2022 10:30 AM

Buzz: Mohan Raja Do Multi Starrer With Nagarjuna, Akhil - Sakshi

తండ్రీకొడుకు నాగార్జున, అఖిల్‌ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్‌ రాజా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశారట మోహన్‌  రాజా. ప్రస్తుతం ఫైనల్‌ టచ్‌ ఇచ్చే పనిలో ఉన్నారట. కాగా ఈ మధ్య వరుసగా యాక్షన్‌ సినిమాలతో బిజీగా గడిపారు నాగార్జున. ఓ చిన్న బ్రేక్‌ తర్వాత ఈ సినిమాను ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నారట నాగార్జున.

(చదవండి: గాడ్‌ ఫాదర్‌ ఆ రేంజ్‌ బ్లాక్‌బస్టర్‌)

ఈలోపు అఖిల్‌ కూడా తన తాజా చిత్రం ‘ఏజెంట్‌’ను దాదాపు పూర్తి చేసేస్తారట. ఆ తర్వాత తండ్రితో కలిసి చేయనున్న సినిమా సెట్స్‌లో అడుగుపెడతారని టాక్‌. ఇదిలా ఉంటే.. ఇది నాగార్జున కెరీర్‌లో వందో చిత్రం అనే టాక్‌ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement