Nagarjuna and Nani Will Attend Jayamma Panchayathi Pre-Release Event as the Chief Guests - Sakshi
Sakshi News home page

Anchor Suma: సుమ కోసం రంగంలోకి నాగార్జున, నాని

Published Fri, Apr 29 2022 6:44 PM | Last Updated on Fri, Apr 29 2022 7:38 PM

Nagarjuna, Nani Chief Guest To Suma Jayamma Panchayat Pre Release Event - Sakshi

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై  ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది చిత్ర యూనిట్‌.

ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తాన్ని ఖరారు చేసింది చిత్ర బృందం. రేపు (ఏప్రిల్‌ 30) ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇక ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా స్టార్‌ హీరోలైన నాగార్జున అక్కినేని, నేచురల్‌ స్టార్‌ నాని వస్తున్నారు. జయమ్మ పంచాయి ప్రీ రిలీజ్‌ వేడుకకు సంబంధించిన పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు మేకర్స్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement