వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ రోజున తన పుట్టిన రోజు జరపుకుంటున్నారు. నాని ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకంగా హీరోగానే కాదు నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకున్న తరువాత నాని జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇదే. అంతేకాదు నానితో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న, త్వరలో సినిమాలు చేయబోయే నిర్మాణ సంస్థలు కూడా నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాయి.