హిందీలో పాపులర్ షో అయినా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకుంది తారక్ మెహతా కా ఉల్టా చష్మా. అయితే ఈ షో నుంచి నటీనటులు ఒక్కొక్కరుగా వైదొలిగారు. గత కొద్దికాలంగా ఈ షో నిర్మాతలపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో నటించిన మోనికా భదోరియా, ప్రియా అహుజా, శైలేష్ లోధా, దిశా వకాని ఇప్పటికే గుడ్ బై చెప్పేశారు. అయితే గతంలో నిర్మాతలు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!)
ఈ విషయంపై తాజాగా జెన్నిఫర్ మిస్త్రీ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై లైంగిక వేధింపులకు సంబంధించి ఇప్పటికే జెన్నిఫర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇవాళ ఉల్టా చష్మా షో నిర్మాత అలిత్ మోడీ, ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జతిన్ బజాజ్పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా.. అసిత్ మోడీతో పాటు కొంతమంది నటీనటులపై జెన్నిఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
ఆరోపణలు నిరాధారం: అసిత్ మోడీ
తనపై జెన్నిఫర్ మిస్త్రీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అసిత్ మోడీ కొట్టిపారేశారు. తన పరువు తీసేందుకు అలా చేస్తోందని .. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. పోలీసులు విచారణ తర్వాతే నిజాలు బయటకు వస్తాయని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
(ఇది చదవండి: మహిళతో సహజీవనం.. లైవ్లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!)
Comments
Please login to add a commentAdd a comment