Buzz: Producer Ravindar Chandrasekaran Gifted 1 And Half Kg Gold To Mahalakshmi - Sakshi
Sakshi News home page

Ravindar- Mahalakshmi : సీరియల్‌ నటి మహాలక్ష్మీకి అంత బంగారం గిఫ్టుగా ఇచ్చాడా?

Published Sat, Sep 24 2022 3:33 PM | Last Updated on Sat, Sep 24 2022 4:15 PM

Is Producer Ravindar Chandrasekaran Gifted 1 And Half Kg Gold To Mahalakshmi - Sakshi

ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్‌ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చూడచక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్‌ను పెళ్లాడటంతో ఈ జంట హాట్‌టాపిక్‌గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాటే కాకుండా సోషల్‌ మీడియాలోనూ తెగ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

ప్రేమకు అందంతో పనిలేదు అని కొందరు పొగుడుతుంటే, మరికొందరేమో డబ్బు ఉంటే అందంతో పని లేదు, అతను నిర్మాత, అతని దగ్గర బాగా డబ్బులున్నాయి కాబట్టే అతడ్ని పెళ్లాడింది అంటూ తెగ ట్రోల్స్‌ చేశారు. ఇక పెళ్లినాటి నుంచి సోషల్‌ మీడియాలో వీపరీతంగా సెన్సేషన్‌ అయిన ఈ జంట ఏం చేసినా క్షణాల్లో  వైరల్‌ అయ్యేది. తాజాగా మహాలక్ష్మికి పెళ్లి సందర్బంగా రవీందర్‌ ఇచ్చిన కానుకలు ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి.

రవీందర్‌ భార్య కోసం సుమారు కేజీన్నర బంగారు కానుకలను గిఫ్టుగా ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లిరోజు ఆమె ధరించిన బంగారం మొత్తం నిర్మాత రవీందర్‌ చేయించిందు అంటున్నారు. కాగా వీరిద్దరికి ఇది రెండో వివాహం. యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన మహాలక్ష్మీ నటిగా తమిళనాట మంచి గుర్తింపును సంపాదించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement