Ravindar
-
చుక్కేసి.. హోర్డింగ్ ఎక్కేసి.. పైన పక్కేసి.. గురక పెట్టేసి..
సాక్షి, నిజామాబాద్/కామారెడ్డి: తాగిన మైకంలో హోర్డింగ్ ఎక్కిన యువకుడు అక్కడే నిద్రపోయిన ఘటన నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ వద్ద చోటు చేసుకుంది. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన మేస్త్రీ పని చేసే రవీందర్ అలియాస్ రవి ఆదివారం మద్యం ఎక్కువ మోతాదులో తీసుకుని అక్కడే ఉన్న హోర్డింగ్ ఎక్కి నిద్రపోయాడు. హోర్డింగ్‌పై రవీందర్‌ను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు, మూడో టౌన్ పోలీసులు చేరుకున్నారు. వారి సూచన మేరకు స్థానికులు హోర్డింగ్ ఎక్కి రవీందర్‌ను కిందికి దింపారు. ఇవి చదవండి: 'వీఓఏ' కదా అని అందరూ నమ్మారు.. తిరిగి చూస్తే షాక్! -
బోనాల పండుగకు వస్తుండగా.. తీవ్ర విషాదం!
వరంగల్: బోనాల పండుగకు వస్తుండగా స్కూటీ అదుపు తప్పి కిందపడడంతో ఓ యువకుడు మృతి చెందగా ఓ మహిళ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన పులి రవీందర్(30) హనుమకొండ కోర్టులో జ్యుడీషియల్ క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తూ తన చిన్నమ్మ చిర్ర పద్మ ఇంట్లో ఉంటున్నాడు. స్వగ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాల పండగ ఉండడంతో తన స్కూటీపై చిన్నమ్మ పద్మను తీసుకుని వస్తున్నాడు. ఈ క్రమంలో చింతలపల్లి రైల్వేగేట్ వద్దకు రాగానే స్కూటీ అదుపు తప్పడంతో ఇద్దరు కిందపడ్డారు. దీంతో తీవ్రగాయాలలైన క్షతగాత్రులను వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా రవీందర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పద్మ చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై మృతుడి సోదరుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.భరత్ తెలిపారు. రవీందర్‌కు జిల్లా జడ్జి కృష్ణమూర్తి నివాళి.. హనుమకొండ జిల్లా కోర్టులో క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తున్న పులి రవీందర్ ఆదివారం సంగెం మండల కేంద్రంలోని చింతలపల్లి రైల్వే గేట్ వద్ద స్కూటీపై నుంచి పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కృష్ణమూర్తి సతీసమేతంగా వరంగల్ ఎంజీఎం మార్చురీలో రవీందర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో వరంగల్, హనుమకొండ జ్యుడీషియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బుజ్జి బాబు, మల్లికార్జున్, కోర్టు సిబ్బంది, సర్పంచ్ల ఫోరం సంగెం మండల అధ్యక్షుడు డేటి బాబు తదితరులు ఉన్నారు. -
నా భర్తను హోంగార్డు ఆఫీస్ వాళ్లే చంపారు: రవీందర్ భార్య
-
హోంగార్డు రవీందర్ మృతిపై భార్య కన్నీరు మున్నీరు
-
హోంగార్డ్ రవీందర్ మృతి
-
రవీందర్‌ను పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
-
భర్తకు 6 అడుగుల గిఫ్ట్ ఇచ్చిన నటి
-
మహాలక్ష్మికి నా భర్తతో అఫైర్.. అందుకే ఆమె భర్త వదిలేశాడు : నటి
ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చూడచక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్‌ను పెళ్లాడటంతో ఈ జంట హాట్‌టాపిక్‌గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాటే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యకాలంలో వీళ్లపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరి మీద వచ్చి ఉండవు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. తాజాగా మహాలక్ష్మి గురించి నటి జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. మహాలక్ష్మికి తన భర్తతో అఫైర్ ఉందని, అందుకే మొదటి భర్త ఆమెను వదిలేశాడంటూ పేర్కొంది. తన ముందే ఆమెతో వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడని, అంతేకాకుండా మహాలక్ష్మి కొడుకు తన భర్తను నాన్న అని పిలుస్తున్నాడంటూ గతంలో జయశ్రీ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వార్తలను కొట్టిపారేసిన మహాలక్ష్మి జయశ్రీ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో రవీందర్ తనకు అండగా నిలబడ్డాడని, అందుకే అతనితో కొత్త జీవితం ప్రారంభించానని తెలిపింది. -
నిర్మాతతో రెండో పెళ్లి.. భార్యకు ఎంత బంగారం పెట్టాడో తెలుసా?
ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చూడచక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్‌ను పెళ్లాడటంతో ఈ జంట హాట్‌టాపిక్‌గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాటే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రేమకు అందంతో పనిలేదు అని కొందరు పొగుడుతుంటే, మరికొందరేమో డబ్బు ఉంటే అందంతో పని లేదు, అతను నిర్మాత, అతని దగ్గర బాగా డబ్బులున్నాయి కాబట్టే అతడ్ని పెళ్లాడింది అంటూ తెగ ట్రోల్స్ చేశారు. ఇక పెళ్లినాటి నుంచి సోషల్ మీడియాలో వీపరీతంగా సెన్సేషన్ అయిన ఈ జంట ఏం చేసినా క్షణాల్లో వైరల్ అయ్యేది. తాజాగా మహాలక్ష్మికి పెళ్లి సందర్బంగా రవీందర్ ఇచ్చిన కానుకలు ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. రవీందర్ భార్య కోసం సుమారు కేజీన్నర బంగారు కానుకలను గిఫ్టుగా ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లిరోజు ఆమె ధరించిన బంగారం మొత్తం నిర్మాత రవీందర్ చేయించిందు అంటున్నారు. కాగా వీరిద్దరికి ఇది రెండో వివాహం. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన మహాలక్ష్మీ నటిగా తమిళనాట మంచి గుర్తింపును సంపాదించుకుంది. -
తుపాకీతో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: దమ్మాయిగూడలోని శ్రీఆదిత్య ఆస్పత్రి ఎండీ డాక్టర్ రవీంద్రకుమార్ తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్చుకుని సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి కాప్రా సాకేత్ మిథిల ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లా కేంద్రం సిద్దిపేటకు చెందిన డాక్టర్ రవీంద్రకుమార్, డాక్టర్ స్మిత దంపతులు. వీరికి ఒక కుమారుడు. వీరు ఆరేళ్ల క్రితం దమ్మాయిగూడలో శ్రీ ఆదిత్య ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. కాప్రా సాకేత్ సమీపంలోని మిథిల ఎన్‌క్లేవ్‌లోని ఫ్లాట్ నంబర్ 57లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రవీంద్రకుమార్, స్మిత దంపతుల మధ్య బంధువుల ఫంక్షన్‌కు వెళ్లే విషయమై ఘర్షణ జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో కుమారుడిని తీసుకుని స్మిత దిల్‌సుఖ్‌నగర్‌లోని తల్లిగారింటికి వెళ్లారు. ఆ తర్వాత రాత్రి 2 గంటల సమయంలో రవీంద్రకుమార్ తన కుమారుడికి ఫోన్‌చేసి మాట్లాడారు. అనంతరం ఆయన తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీఆదిత్య ఆస్పత్రి ఎండీ డాక్టర్ రవీంద్రకుమార్ ఘటన వెలుగు చూసిందిలా.. స్మిత చెల్లెలు స్వప్న ఆదిత్య ఆసుపత్రిలోనే పనిచేస్తోంది. సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చి రవీంద్రకుమార్‌కు ఫోన్‌చేయగా లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఫ్లాట్కువెళ్లి చూడగా డాక్టర్ రవీంద్రకుమార్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. పక్కనే తుపాకీ ఉంది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారమిచ్చారు. కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ ఘటన స్థలానికి చేరుకుని డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో పరిసరాల్లో గాలించారు. రవీంద్రకుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబసభ్యులు, ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. జవహర్‌నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్‌కు గతంలో ‘మాజీ’ల బెదిరింపులు మాజీ నక్సలైట్ల పేరుతో 2015లో డాక్టర్ రవీంద్రకుమార్‌కు బెదిరింపులు వచ్చాయి. అప్పట్లో చాకచక్యంగా వ్యవహరించిన ఆయన తన ఆస్పత్రిలోనే 2016లో వారిని జవహర్‌నగర్ పోలీసులకు పట్టించారు. అప్పటి నుంచి ఫోన్ బెదిరింపులు వస్తుండటంతో లైసెన్స్డ్ గన్ తీసుకున్నారు. కాగా, జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక్కరోజు వ్యవధిలో ఓ జవాన్‌తో పాటు డాక్టర్ తమ వద్ద ఉన్న గన్లతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. -
భార్యతో గొడవ వల్లే ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాల కారణంగానే శ్రీఆదిత్య హాస్పిటల్ ఎండీ డాక్టర్ రవీందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంధువుల గృహ ప్రవేశానికి భార్య రాకపోవడంతో మనస్తాపం చెంది తన లైసెన్స్ రివాల్వర్ కాల్చుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. సోమవారం జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధిలోని సాకేత్ మిథిలలో ప్లాట్ నెంబర్ 57 గల ప్లాట్‌లో డాక్టర్ రవీందర్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. రవీందర్ కుమార్ మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉండడంతో టుంబ సభ్యులు వెంటనే జవహర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిశోధించారు. రవీందర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. రవీందర్ ఆత్మహత్య కేసుపై జవహర్ నగర్ సిఐ మాట్లాడుతూ సిద్దిపేటకు చెందిన రవీందర్ కాప్రా సాకేత్ మిథిలాలోని ప్లాట్ నెంబర్ 57 లో నివాసం ఉంటున్నారని, నిన్న రాత్రి భార్య భర్తల మధ్య ఘర్షణ కాగా డాక్టర్ రవీంద్ర భార్య స్మిత రాత్రి పదకొండు గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ లోని తన తల్లిగారింటికి వెళ్లిందని.. దీనితో మనస్తాపానికి గురై తన లైసెన్స్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం డాక్టర్ రవీంద్ర కుమార్ పోను లిఫ్ట్ చేయకపోవడంతో ఆదిత్య హస్పెటల్ పనిచేసే తన భార్య చెల్లలు స్వప్న ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో ఉన్న డాక్టర్ రవీంద్ర కుమార్ ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిందని తెలిపారు. అనుమానాస్పద కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేపట్టారు. -
శ్రీ ఆదిత్య హాస్పటల్ ఎండీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్‌లోని శ్రీ ఆదిత్య హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ రవీందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జవహర్ నగర్‌లోని దమ్మాయి గూడలో సోమవారం ఆయన తన లైసెన్స్ రివాల్వార్‌తో కాల్చుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. కాగా ఆర్థిక ఇబ్బందులు కారణంగానే రవీందర్ కుమార్ ఈ ఘటనకు పాల్పడినట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో పరిశోధిస్తున్నారు. సిద్దిపేటకు చెందిన రవీందర్ కాప్రా సాకేత్ మిథులలో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన సీపీ
సాక్షి, జనగాం: రాష్ట్రంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనంతరం రాజకీయ నేతలు, పోలీసులు బ్యాలెట్ బాక్స్‌ల మీద దృష్టి పెట్టారు. జిల్లాలో బాలెట్బాక్స్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్ కోరకు ఏర్పాటు చేసిన భద్రత ఎర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.వి.రవీందర్ గురువారం పరిశీలించారు. జిల్లాలోని 12 మండలాలకు జరిగిన మూడు విడతలు పరిషత్ ఎన్నికలకు సంబంధించి వీ.బీ. ఐటీ ఏకశిల కళాశాలతో పాటు మైనారిటీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచిన బ్యాలేట్ బాక్స్‌లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ భద్రత ఏర్పాట్లతో పాటు, బ్యాలెట్ బాక్స్ భద్రత కోసం స్ట్రాంగ్ రూముల పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీ.సీ కెమెరాల పనీతీరుపై పోలీస్ కమిషనర్ దృష్టి పెట్టడంతో పాటు, స్ట్రాంగ్ రూముల వద్ద పోలీస్ భద్రత ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఓట్ల లెక్కింపుకు సంబంధించిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు సమయంలో చేపట్టాల్సిన బారీకేడ్ల నిర్మాణంతో పాటు, మండలాల వారిగా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు, పోలింగ్ ఎజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రానికి ఏ రీతిలో చేరుకోవాల్సి వుంటుందనే అంశాలపై పోలీస్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులపై ఆయన సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. -
పరీక్షలు ప్రశాంతం
పరీక్షలు ప్రశాంతం అద్దంకి, : పట్టణంలో ఆదివారం నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల పరీక్షలు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 1352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 852 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 500 మంది గైర్హాజరయ్యారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జీ రవీందర్ పట్టణంలోని ఐదు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్డీసీ రవీందర్ మాట్లాడుతూ అద్దంకి పట్టణంలోని కట్టా రామకోటేశ్వరరావు కళాశాల సెంటర్లో 312 మందికి 190 మంది, గోవిందాంబికా పరమేశ్వరి కళాశాలలో 348 మందికి 225 మంది, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో 308 మందికి 189 మంది, విశ్వభారతిలో 264 మందికి 170 మంది, ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 120 మందికి 78 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కూడా పరీక్షకు అనుమతించడంతో చాలా మందికి మేలు జరిగిందన్నారు. విశ్వభారతీ కళాశాలలో ఒక విభిన్న ప్రతిభా వంతునికి, కేఆర్కే డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసిన ఒక అంధ అభ్యర్థినికి ప్రత్యేక వసతులు కల్పించినట్లు తెలిపారు. కట్టా రామకోటేశ్వరరావు డిగ్రీ కళాశాలలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు పట్టణంలోని భవిష్య పాఠశాల యాజమాన్యం ఉచితంగా రెండు బస్సులు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎంపీడీఓ కృష్ణమోహన్, ఎంఈఓ విజయకుమార్ లైజనింగ్ అధికారులుగా, వ్యవసాయాధికారి కే రమేష్, పంచాయతీ రాజ్ ఏఈలు రామ్ కుమార్, జే రవిబాబు, ఎంవీ నాగేశ్వరరావు, ఈఓపీఆర్డీ కవితా చౌదరి అసిస్టెంట్ లైజనింగ్ అధికారులుగా వ్యవహరించారు. పట్టణంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లోని కేఆర్కే డిగ్రీ కళాశాల సెంటర్‌ను, ప్రకాశం జూనియర్ కళాశాల సెంటర్లో పరీక్షలను జెడ్పీ సీఈఓ ప్రసాద్ పరీశీలించారు. -
ఇల్లెందు సీఐపై బదిలీ వేటు
ఇల్లెందు, న్యూస్‌లైన్: ఇల్లెందు పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఎస్పీతనిఖీ చేశారు. ఇల్లెందులో ‘జీ’ టైప్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులఇల్లెందు సీఐ కె.రవీందర్‌పై బదిలీ వేటు పడింది. ఆయన పనితీరు సరిగా లేదని, అన్నింటా విఫలమయ్యారని, అందుకే వేకెన్సీ రిజర్వ్(వీఆర్)కు మారుస్తున్న ట్టు ఎస్పీ రంగనాధ్ చెప్పారు. ను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన దొంగతనాలను ఛేదించటంలో, ట్రాఫిక్ నియంత్రణలో, ఫిర్యాదులను పరిష్కరించటంలో, సర్కిల్ పర్యవేక్షణలో ఆయన విఫలమయ్యారని చెప్పారు. అందుకే ఆయనను వీఆర్‌కు మార్చినట్టు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో సమర్థుడైన సీఐని, మరో ఎస్ఐని నియమిస్తామని అన్నారు. ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ చేయాల్సిందే పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఎస్పీ అన్నారు. అలా జరగనట్టయితే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుదారులు కూడా రసీదులు తీసుకోవాలని సూ చించారు. ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ చేసి సరైన దర్యాప్తు చేసినట్టయితే ఫిర్యాదుదారుడికి న్యాయం జరుగుతుందని అన్నారు. రౌడీయిజాన్ని సహిం చేది లేదన్నారు. పోలీసు సంక్షేమానికి సముచిత స్థానం కల్పిస్తున్నామని, అనారోగ్యంతో బాధపడే పోలీసులకు వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా వారికి పోలీస్ స్టేషన్లలోనే విధులు అప్పగిస్తున్నామని అన్నారు. జిల్లాలో నక్సలిజం అదుపులో ఉందన్నారు. పోలీస్ ఇంటిలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నామన్నారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, బెల్టు షాపుల నిరోధంపై, మద్యం షాపుల ముందు రోడ్లపై నిలబడి (మద్యం) తాగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశానంతరం, డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. -
అడవిలో హల్చల్
మన్ననూర్, న్యూస్‌లైన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక నల్లమల అడవిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి పోలీసులకు వచ్చిన ఫోన్‌కాల్ కలకలం సృష్టించింది. పోలీసులను ఉరుకులు పరుగులు పె ట్టించి ముచ్చెమటలు పట్టించింది. పోలీ సులు, ఫారెస్ట్సిబ్బంది అడవిలో జల్లెడపట్టినా వారి ఆచూకీ లభించింది. చివరికి చిన్న క్లూ ద్వారా వారి పట్టుకోవడం కథ సుఖాంతమైంది. ఈ సంఘటన మన్ననూర్ అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. అమ్రాబాద్ ఎస్ఐ రవీందర్ కథనం మేరకు.. ఏం జరిగిందంటే.. ‘హైదరాబాద్‌కు చెందిన మేము చెక్‌పోస్టు వద్ద కారు ఉంచి నా భార్య, నేను కుటుంబ సమస్యలు, అప్పులు, వ్యక్తిగత కారణాలతో బతుకుమీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి నల్లమల అడవిలోని వెళుతున్నాం..’ అంటూ ఓ అపరిచిత వ్యక్తి పోలీసులకు ఫోన్‌చేసి కట్ చేశాడు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆరాతీశారు. ఉదయం 6 గంటలకు అచ్చంపేట ఆర్టీసీ డిపో బస్సు ఎక్కి శ్రీశైలం వైపు వెళ్లారని స్థానిక హోటల్ నిర్వాహకులు తెలిపారు. వారు విడిచి వెళ్లినట్టు భావిస్తున్న (ఏపీ 09 బికె 4423) స్పార్క్ కారు డోర్లకు తాళం తీసి ఉండటంతో పోలీసులు తెరిచి చూశారు. అందులో వివిధ బ్యాంకులకు చెందిన సుమారు పది ఏటీఎం కార్డులు ఉన్నట్లు గుర్తించారు. వేర్వేరు పేర్లతో ఆర్సీ, డ్రైవింగ్ లెసైన్స్, కారు కాగితాలు, ల్యాప్‌టాప్ మరికొన్ని వస్తువులను కనుగొన్నారు. సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో ఫారెస్టు సిబ్బంది వెతికినా వారి ఆచూకీ మాత్రం లభించలేదు. చిక్కారు ఇలా.. హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు, స్థానికులు కలిసి ఒకేఒక ఆధారంగా భావించి తమకు ఫోన్వచ్చిన సెల్: 9701277983 ద్వారా రంగంలోకి దిగారు. అదేవిధంగా డ్రైవింగ్ లెసైన్స్‌పై అనిల్‌కుమార్ తండ్రి గోపాలకృష్ణగౌడ్ ఏడ్చెర్ల నిజమాబాద్ జిల్లా, ఆర్సీ పేపర్‌పై తాటికొండ శ్రీనివాసాచారి తండ్రి సద్గురాచారి అని లభ్యమైన వివరాలు పోలీసులకు మరింత తోడయ్యాయి. దీంతో మొబైల్ ట్రాకర్ ద్వారా పై నెంబర్ నుంచి వచ్చిపోయే ఫోన్‌కాల్స్‌ను పసిగట్టారు. చివరికి వారిని శ్రీశైలం క్షేత్రంలోని నందిమండపం సర్కిల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు శ్రీనివాసాచారి(31), శ్రావణి(29)గా గుర్తించారు. వారు గతకొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవాలని భావించి..నల్లమల అటవీప్రాంతానికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలిం ది. నేరుగా ఆర్టీసీ బస్సులో వచ్చిన వారు శుక్రవారం మధ్యాహ్నం పాతాళగంగలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా అక్కడ వీలుపడకపోవడంతో పలుప్రాంతాలు తిరిగారు. ఆ తరువాత శ్రీశైలం క్షేత్ర సమీపంలోని ఇష్టకామేశ్వరిని దర్శనం చేసుకున్నారు. రాత్రి పోలీసులు వారిని పట్టుకుని హైదరాబాద్‌కు తరలించడంతో కథ సుఖాం తమైంది. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.