
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్‌లోని శ్రీ ఆదిత్య హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ రవీందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జవహర్ నగర్‌లోని దమ్మాయి గూడలో సోమవారం ఆయన తన లైసెన్స్ రివాల్వార్‌తో కాల్చుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. కాగా ఆర్థిక ఇబ్బందులు కారణంగానే రవీందర్ కుమార్ ఈ ఘటనకు పాల్పడినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో పరిశోధిస్తున్నారు. సిద్దిపేటకు చెందిన రవీందర్ కాప్రా సాకేత్ మిథులలో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment