
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాల కారణంగానే శ్రీఆదిత్య హాస్పిటల్ ఎండీ డాక్టర్ రవీందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంధువుల గృహ ప్రవేశానికి భార్య రాకపోవడంతో మనస్తాపం చెంది తన లైసెన్స్ రివాల్వర్ కాల్చుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. సోమవారం జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధిలోని సాకేత్ మిథిలలో ప్లాట్ నెంబర్ 57 గల ప్లాట్లో డాక్టర్ రవీందర్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. రవీందర్ కుమార్ మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉండడంతో టుంబ సభ్యులు వెంటనే జవహర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిశోధించారు. రవీందర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
రవీందర్ ఆత్మహత్య కేసుపై జవహర్ నగర్ సిఐ మాట్లాడుతూ సిద్దిపేటకు చెందిన రవీందర్ కాప్రా సాకేత్ మిథిలాలోని ప్లాట్ నెంబర్ 57 లో నివాసం ఉంటున్నారని, నిన్న రాత్రి భార్య భర్తల మధ్య ఘర్షణ కాగా డాక్టర్ రవీంద్ర భార్య స్మిత రాత్రి పదకొండు గంటల సమయంలో దిల్‌సుఖ్ నగర్ లోని తన తల్లిగారింటికి వెళ్లిందని.. దీనితో మనస్తాపానికి గురై తన లైసెన్స్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం డాక్టర్ రవీంద్ర కుమార్ పోను లిఫ్ట్ చేయకపోవడంతో ఆదిత్య హస్పెటల్ పనిచేసే తన భార్య చెల్లలు స్వప్న ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో ఉన్న డాక్టర్ రవీంద్ర కుమార్ ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిందని తెలిపారు. అనుమానాస్పద కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment