ఇల్లెందు, న్యూస్‌లైన్: ఇల్లెందు పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఎస్పీతనిఖీ చేశారు. ఇల్లెందులో ‘జీ’ టైప్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులఇల్లెందు సీఐ కె.రవీందర్‌పై బదిలీ వేటు పడింది. ఆయన పనితీరు సరిగా లేదని, అన్నింటా విఫలమయ్యారని, అందుకే వేకెన్సీ రిజర్వ్(వీఆర్)కు మారుస్తున్న ట్టు ఎస్పీ రంగనాధ్ చెప్పారు. ను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన దొంగతనాలను ఛేదించటంలో, ట్రాఫిక్ నియంత్రణలో, ఫిర్యాదులను పరిష్కరించటంలో, సర్కిల్ పర్యవేక్షణలో ఆయన విఫలమయ్యారని చెప్పారు. అందుకే ఆయనను వీఆర్‌కు మార్చినట్టు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో సమర్థుడైన సీఐని, మరో ఎస్‌ఐని నియమిస్తామని అన్నారు.
ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ చేయాల్సిందే
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఎస్పీ అన్నారు. అలా జరగనట్టయితే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుదారులు కూడా రసీదులు తీసుకోవాలని సూ చించారు. ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ చేసి సరైన దర్యాప్తు చేసినట్టయితే ఫిర్యాదుదారుడికి న్యాయం జరుగుతుందని అన్నారు. రౌడీయిజాన్ని సహిం చేది లేదన్నారు. పోలీసు సంక్షేమానికి సముచిత స్థానం కల్పిస్తున్నామని, అనారోగ్యంతో బాధపడే పోలీసులకు వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా వారికి పోలీస్ స్టేషన్లలోనే విధులు అప్పగిస్తున్నామని అన్నారు. జిల్లాలో నక్సలిజం అదుపులో ఉందన్నారు. పోలీస్ ఇంటిలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నామన్నారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, బెల్టు షాపుల నిరోధంపై, మద్యం షాపుల ముందు రోడ్లపై నిలబడి (మద్యం) తాగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశానంతరం, డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
ఇల్లెందు సీఐపై బదిలీ వేటు
Published Thu, Dec 12 2013 2:54 AM | Last Updated on Mon, Aug 13 2018 2:57 PM
Advertisement
Advertisement